Home
Mobile

Vivo V60 Smartphone వివో V60 స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్..!

వివో నుంచి భారత్‌ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. త్వరలో వివో V60 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ వివో ఫోన్‌ విడుదల తేదీ సహా ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ మిడ్‌రేంజ్‌ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుంది? :
వివో V60 స్మార్ట్‌ఫోన్‌ విడుదల వివరాలు Smartprix ద్వారా వెల్లడయ్యాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఆగస్టు 12 న విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ రూ.37 వేల నుంచి రూ.40 వేల మధ్య ప్రారంభ ధర ఉండే అవకాశం ఉందని చెబుతోంది.

Vivo V60 Smartphone

డిస్‌ప్లే వివరాలు! :
వివో V50 స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా వివో V60 హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చిప్‌సెట్ అంచనా వివరాలు :
గతంలో వచ్చిన లీక్స్‌ ఆధారంగా ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS (అవుట్‌ ఆఫ్ ది బాక్స్) పైన పనిచేస్తుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇటీవల వచ్చిన లీక్స్‌ ఆధారంగా వివో V60 స్మార్ట్‌ఫోన్‌ Zeiss భాగస్వామ్యంతో ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్, 3x జూమ్‌తో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మరియు 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వివో V60 స్మార్ట్‌ఫోన్‌ మిస్ట్‌ గ్రీన్, మూన్‌లిట్‌ బ్లూ, ఆస్పీషియల్‌ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చి ఉంటుందని తెలుస్తోంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం.

వివో V60 స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీపై వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతోపాటు ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలపై స్పందించలేదు. అయితే త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో V50 స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V60 Smartphone launch date and key specifications leaked here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X