Home
Mobile

50MP + 50MP + 50MP కెమెరాలు, 6500mAh భారీ బ్యాటరీతో Vivo స్మార్ట్‌ఫోన్‌.. సూపర్‌ డిజైన్ సహా...!

Vivo V60 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి వివో V60 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. మిడ్‌ రేంజ్‌ ధరలో ఈ ఫోన్ విడుదల అయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల అయిన వివో V50 స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా వివో V60 హ్యండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 50MP సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది.

వివో V60 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080 x 2392 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 5000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

Vivo V60 Smartphone features

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ :
వివో V60 స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 16GB LPDDR4x ర్యామ్, 512GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ AI స్మార్ట్ కాల్‌ అసిస్టెంట్‌, ఏఐ ఆధారిత స్పామ్‌ బ్లాక్‌ టూల్‌, AI Image Expander వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంది.

Vivo V60 Smartphone features

50MP + 50MP + 8MP + 50MP కెమెరాలు :
ఈ ఫోన్ Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా, 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక, ముందు కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. మరియు ఈ ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.4, వైఫై, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Vivo V60 Smartphone features

వివో V60 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
వివో V60 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.40999 గా ఉంది.

16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.45999 గా ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 19 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆస్పీషియస్‌ గోల్డ్‌, మిస్ట్‌ గ్రే, మూన్‌లిట్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V60 Smartphone launched with Snapdragon 7 gen 4 Chip and 6500mAh Battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X