వివో కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుంది..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో భారత్ మార్కెట్‌లో ఇటీవల అనేక మోడల్స్ ను లాంచ్ చేస్తోంది. ఇటీవలే వివో T4 ప్రో మోడల్‌ను లాంచ్ చేయగా.. అంతకంటే కొన్నిరోజుల క్రితం వివో V60 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఇప్పటికే మిడ్‌రేంజ్‌లో అనేక మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వివో త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనుంది.
టిప్‌సెట్ సంజూ చౌదరీ వివరాల ఆధారంగా వివో త్వరలో V60e స్మార్ట్‌ఫోన్‌ను (Vivo V60e Smartphone) విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం తొలిరోజుల్లో వివో 50e మోడల్ లాంచ్ అయింది. దీనికి తర్వాత వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది :
టిప్‌స్టర్ వివరాల ఆధారంగా వివో V60e స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ నెలాఖరులోగా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీ వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌తోపాటు ఇ-కామర్స్ ద్వారా అందుబాటులోకి రానుంది.
ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది :
టిప్‌స్టర్ వివరాల ఆధారంగా వివో V60e స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.28999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్ ను రూ.31999 గా ఉంటుందని తెలుస్తోంది.
అంచనా వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వివో V60e స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు మీడియాటైక్ 7 సిరీస్ చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ గురించి పైన తెలిపిన వివరాలపై వివో ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఈ ఫోన్ అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ మిడ్ రేంజ్‌లోనే అందుబాటులోకి రానుంది తెలుస్తోంది.
* ఇటీవల విడుదల అయిన వివో V60 స్మార్ట్‌ఫోన్ 8GB/128GB ధర రూ.36999, 8GB/256GB రూ.38999, 12GB/256GB ధర రూ.40999, 16GB/512GB ధర రూ.45999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ Zeiss కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా (OIS), 50MP సోనీ IMX882 టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








