200MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 6500mAh బ్యాటరీతో Vivo 5G స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు..!
వివో భారత్ మార్కెట్‌లో ఇవాళ వివో V60e స్మార్ట్‌ఫోన్ ను (Vivo V60e Smartphone Launched) విడుదల చేసింది. వివో V60 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే V60 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాగా.. ఇవాళ V60e ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 200MP కెమెరాను కలిగి ఉంది. 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేలో విడుదల అయింది. 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Low Blue Light సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ వివో హ్యాండ్‌సెట్ మీడియా డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చని తెలుస్తోంది.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వివో వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో (Vivo 200MP camera Smartphone) విడుదల అయింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 30x జూమ్, 85mm పొర్ట్రెయిట్ ఇమేజింగ్‌తో 200MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, Aura లైట్‌ను కూడా అమర్చి ఉంది.

50MP సెల్ఫీ కెమెరా :
ఈ వివో V60e స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఆటో ఫోకస్, AI Aura లైట్ పొర్ట్రెయిట్ సపోర్టుతో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI Festival Portrait ను కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదేనని వివో చెబుతోంది. దీంతోపాటు ఏఐ ఫోర్ సీజన్ పొర్ట్రెయిట్, Image Expander ఫీచర్లు కూడా ఉన్నాయి.
6500mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, ఏఐ క్యాప్షన్స్, AI Erase 3.0, AI స్మార్ట్ కాల్ అసిస్టెంట్, జెమిని వంటి ఫీచర్లున్నాయి. NFC, IR బ్లాస్టర్, 360 డిగ్రీల ఓమ్నిడైరెక్షనల్ యాంటెన్నాను కలిగి ఉంది.

వివో V60e స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉంది.
What you manifested is happening for real. This festive season will be your slay-season with vivo V60e. Hurry to get amazing offers!
— vivo India (@Vivo_India) October 7, 2025
Prebook now! https://t.co/70kFJ7bzAe#vivoV60e #PortraitSoPro #SlayEveryDetail pic.twitter.com/q98ghLhwg7
ఈ స్మార్ట్‌ఫోన్ ఇలైట్ పర్పుల్, నోబెల్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








