Home
Mobile

మిడ్‌రేంజ్‌ ధరలో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో మార్కెట్‌ లో ఇటీవల అనేక సంస్థలు 200MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేశాయి. అయితే ఈ మోడల్స్‌ అన్ని ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌ లోనే అందుబాటులోకి వచ్చాయి. అయితే వివో మాత్రం మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌ లో 200MP కెమెరాతో వివో V60e స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొచ్చింది. కెమెరాతోపాటు ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

ధర, సేల్‌ వివరాలు :
వివో V60e స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ లో ఈ సంవత్సరం అక్టోబర్‌ నెలలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉంది.

Vivo V60e Smartphone

ఈ ఫోన్‌ (Vivo V60e Smartphone) ప్రస్తుతం వివో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సహా ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ నోబెల్‌ గోల్డ్‌ కలర్‌, ఇలైట్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తోంది.

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
వివో V60e స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతోంది. ఈ ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

200MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోన్‌ మిడ్‌రేంజ్‌ ధర సెగ్మెంట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా 30x జూమ్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంది. Aura లైట్‌ ను కలిగి ఉంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియా డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

6500mAh బ్యాటరీ :
ఈ వివో V60e స్మార్ట్‌ఫోన్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. AI Erase 3.0, Live Call Translation, AI Smart Call Assistant, AI Festival Portrait, Image Expander, సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, NFC, IR బ్లాస్టర్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును వంటి ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V60e Smartphone with 200MP Camera and 6500mAh battery under Rs30000 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X