ఇవాళ్టి నుంచి 200MP కెమెరా ఫోన్ సేల్.. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ఆఫర్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో భారత్ మార్కెట్లో ఇటీవల వివో V60e స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఏకంగా 200MP కెమెరాను కలిగి ఉంది. మరియు 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ఆకట్టుకొనే రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్‌ను (Vivo V60e Smartphone Sale) వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసి, డిస్కౌంట్‌ను పొందవచ్చు. వివో వెబ్‌సైట్‌లోనూ డిస్కౌంట్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలోనూ బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ఇలైట్ పర్పుల్, నోబెల్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 30x జూమ్‌తో 200MP కెమెరాను కలిగి ఉంది. 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, Aura లైట్‌ను కూడా అమర్చి ఉంది. మరియు 50MP (AF) సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వివో ఫోన్ మీడియా డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని సమాచారం.
90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, జెమిని, Live Call Translation, AI Erase 3.0, AI స్మార్ట్ కాల్ అసిస్టెంట్, ఏఐ క్యాప్షన్స్ పీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే :
వివో V60e స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మరియు Low Blue Light సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ AI Festival Portrait, ఏఐ సీజన్ పొర్ట్రెయిట్, Image Expander వంటి ఇమేజింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ తరహో ఫీచర్లు కలిగిన ఫోన్ ఇదేనని వివో చెబుతోంది. దీంతోపాటు NFC, IR బ్లాస్టర్, 360 డిగ్రీల ఓమ్ని డైరెక్షనల్ యాంటెనాను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications