200MP కెమెరాతో వివో స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ సహా కీలక వివరాలు వెల్లడి..!
వివో నుంచి V60 స్మార్ట్‌ఫోన్ ఇటీవల విడుదల కాగా.. త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. వివో V60e పేరుతో ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఇటీవలే ఫోన్ డిజైన్ కూడా విడుదల అయింది. అయితే భారత్ లో ఈ ఫోన్ విడుదల తేదీ వెల్లడయింది. దీంతోపాటు కెమెరా స్పెసిఫికేషన్ లను కూడా సంస్థ ధ్రువీకరించింది.
ఎప్పుడు విడుదల కానుంది? :
వివో V60e స్మార్ట్‌ఫోన్ (Vivo V60e Smartphone launch date) అక్టోబర్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.

200MP కెమెరా :
అధికారిక లిస్టింగ్ ఆధారంగా వివో v60e స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు, 30x సూపర్‌జూమ్ తో 200MP అల్ట్రా క్లియర్ ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు వృత్తాకార డిజైన్ లో Aura Light ను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ AI ఫెస్టివల్ పొర్ట్రెయిట్ మోడ్‌ను కలిగి ఉంటుందని వివో చెబుతోంది.
6500mAh భారీ బ్యాటరీ, IP68, IP69 రేటింగ్ :
వివో V60e స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కుషనింగ్ స్ట్రక్చర్ తో కూడిన డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ను పొందుతుందని వివో చెబుతోంది. దీంతోపాటు IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలిపింది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో SoC ప్రాసెసర్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ (1080 x 2392 పిక్సల్స్ ) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇలైట్ పర్పుల్, నోబెల్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ధరల వివరాలను ఇటీవలే లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ వివరాల ఆధారంగా వివో V60e స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.38,999 గా ఉంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications








