200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్!.. ధర వివరాలు లీక్..!
వివో ఇండియా ఆ సంవత్సరం ఆగస్టు నెలలో వివో V60 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో విడుదల అయింది. ఇదే సిరీస్ లో మరో స్మార్ట్‌ఫోన్ ను విడుదల కానుంది. వివో V60e పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ అక్టోబర్ నెలలో విడుదల కానుంది. అయితే కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కావాల్సి ఉంది. తాజాగా ఈ ఫోన్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 200MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ (Vivo V60e Smartphone) ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్లు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ ఫోన్ ధరల వివరాలు కూడా లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ ధర వివరాలను అంచనా వేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఫీచర్ల అంచనా వివరాలు.

వివో V60e స్మార్ట్‌ఫోన్ వివరాలు! :
వివో V60e స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ (1080 x 2392 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో SoC చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుందని సమాచారం.
Vivo V60e 5G listed on Flipkart!
— Paras Guglani (@passionategeekz) September 28, 2025
pricing detailed!!
8GB + 128GB 34,999 ~ 28,749 with offers!
8GB + 256GB 36,999 ~ 30,749 with offers!
12GB + 256GB 38,999 ~ 32,749 with offers
Whats your take on pricing?? pic.twitter.com/Pxw4gttIge
200MP కెమెరా! :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 200MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 8MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఫోటోలు, వీడియోలు ఎక్కువగా క్యాప్చర్ చేసే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
IP69, IP69 రేటింగ్‌తో సహా :
ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీంతోపాటు NFC, IR బ్లాస్టర్ ఫీచర్లు కూడా అందిస్తుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ ఇలైట్ పర్పుల్, నోబెల్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు! :
టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ వివరాల ఆధారంగా వివో V60e స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.38,999 గా ఉంటుందని చెప్పారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Photo Credit : Paras Guglani


Click it and Unblock the Notifications








