సెల్ఫీ షూటర్ వచ్చేసింది, ధర రూ. 18,990
వీవో సెల్పీ అభిమానుల కోసం సరికొత్త సెల్ఫీ షూటర్ ని రిలీజ్ చేసింది.
వీవో సెల్పీ అభిమానుల కోసం సరికొత్త సెల్ఫీ షూటర్ ని రిలీజ్ చేసింది. 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన బెజెల్ లెస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.18,990 గా నిర్ణయించింది. 24 మెగా ఫిక్సల్ సెల్ఫీ సామర్ధ్యంతో వచ్చిన ఈ మొబైల్ కి ఫ్లాష్ లైట్ కూడా అమర్చారు.

వివో వీ7 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

కెమెరా సాయంతో..
ఈ ఫోన్‌లోని కెమెరా సాయంతో యూజర్లు తమ ఫేస్‌ను పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుంటే ఫోన్ అన్‌లాక్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా పోర్ట్రెయిట్ మోడ్ అనే ఫీచర్‌ను కెమెరా యాప్‌లో అందిస్తున్నారు.

రెండు సిమ్‌లతోపాటు..
ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఇచ్చారు. దీంతో రెండు సిమ్‌లతోపాటు, మెమొరీ కార్డును కూడా ఈ ఫోన్‌లో వేసుకోవచ్చు.

నవంబర్ 24వ తేదీ నుంచి..
ఈ ఫోన్ నవంబర్ 24వ తేదీ నుంచి విక్రయాలకు రానుంది. వివో వీ7 స్మార్ట్‌ఫోన్ మ్యాట్ బ్లాక్, షాంపేన్ గోల్డ్ రంగుల్లో ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తోంది.


Click it and Unblock the Notifications








