వివో V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..!
Vivo V70 Series : వివో V70 సిరీస్ భారత్ మార్కెట్లో ఫిబ్రవరి 19 వ తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, V70 ఇలైట్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ విడుదల అనంతరం వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. మైక్రోసైట్‌ల ఆధారంగా ఈ సిరీస్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు 6.59 అంగుళాల 1.5K LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. V70 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్, V70 ఇలైట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్ పైన పనిచేస్తుంది. ఈ చిప్ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

ధర వివరాలు లీక్! :
అయితే తాజాగా వివో V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్ (Vivo V70 Elite Smartphone) ధర వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సంజు ఛౌదరి వివరాల ఆధారంగా ఇలైట్ మోడల్ ప్రారంభ ధర రూ.51,999 గా ఉంటుంది. మొత్తంగా మూడు స్టోరేజీ వేరియంట్స్ లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.51999
12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54999
12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999 గా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP IMX766 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ తో 50MP IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
6500mAh బ్యాటరీ :
ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP లెన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
* వివో గత నెలలో భారత్ మార్కెట్ లో వివో X200T స్మార్ట్‌ఫోన్ ను తీసుకొచ్చింది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తోంది.
ఈ ఫోన్ 50MP ప్రైమరీ (OIS) కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ తో 50MP టెలిఫోటో కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 6200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.69999 గా ఉంది.


Click it and Unblock the Notifications