వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లాంచ్ వివరాలు..!
Vivo V70 Series : వివో నుంచి గత సంవత్సరం వివో V60 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. త్వరలో వివో V70 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ ప్లాట్‌ఫాంలో వివో ఫోన్ కనిపించింది. ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. వచ్చే నెలలో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గీక్‌బెంచ్ లిస్టింగ్ :
వివో V70 FE స్మార్ట్‌ఫోన్ (Vivo V70 FE) గీక్‌బెంచ్‌లో V2550 మోడల్ నంబర్‌తో లిస్టింగ్ అయింది. ఈ వివరాలు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు Mali G615 MC2 GPU ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మొత్తంగా మూడు స్మార్ట్‌ఫోన్‌లు :
వివో V70 సిరీస్ భారత్ మార్కెట్‌లో వచ్చే నెలలో విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్‌లో V70 FE, వివో V70, వివో V70 ఇలైట్ వంటి ఫోన్‌లు కూడా లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. అయితే ఈ రెండు ఫోన్‌లు క్వాల్‌కాం చిప్‌సెట్‌లు, సోనీ కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం లీక్ అయిన వివరాల ఆధారంగా వివో V70 స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే V70 Elite మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
Vivo V70 FE V2550 will be powered by MediaTek's Dimensity 7300 SoC.
— Abhishek Yadav (@yabhishekhd) January 19, 2026
Specifications:
🍭 Android 16
🎮 Mali-G615 MC2 r1p3 GPU
⬛ 8GB RAM
OpenCL score: 2,507 pic.twitter.com/yg6ffC0O0G
* వివో V60e స్మార్ట్‌ఫోన్ :
భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం అక్టోబర్ నెలలో వివో V60e స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతోంది. 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 30x జూమ్‌తో 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 50MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ వెనుక వైపు Aura లైట్ ఉంది.
మీడియా డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. AI Erase 3.0, AI Smart Call Assistant, Live Call Translation, Image Expander, AI Festival Portrait వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








