Home
Mobile

Vivo V70 సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు!

Vivo V70 Series : వివో నుంచి భారత్‌ మార్కెట్‌లో త్వరలో వివో V70 సిరీస్‌ లాంచ్‌ కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్‌ మోడల్స్‌ విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ రెండు ఫోన్‌ల ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్‌ మార్కెట్‌లో వివో V70 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరి 19 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయని టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ చెబుతున్నారు. అయితే అధికారిక ప్రకటన రాలేదు.

Vivo V70 series price and sale details tipped

వివో V70 సిరీస్‌ తొలి సేల్‌ ఫిబ్రవరి 25 నుంచి 28 వ తేదీ మధ్యలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే అనంతరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3 వ తేదీ మధ్యలో భారీ డిస్కౌంట్‌లను అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సూపర్‌వీక్‌ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్‌లు అందిస్తుందని భావిస్తున్నారు.

గతంలో వచ్చిన కొన్ని లీక్స్‌ ఆధారంగా వివో V70 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.45999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49999 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. లెమన్‌ యెల్లో, ఫ్యాషన్‌ రెడ్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

అదే వివో V70 ఇలైట్‌ మోడల్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.51999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.56999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.61999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అథెంటిక్‌ బ్లాక్, ఫ్యాషన్ రెడ్‌, శాండ్‌ బీజ్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రాసెసర్‌, OS వివరాలు :
వివో కూడా ఈ సిరీస్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి అధికారికంగా వెల్లడించింది. వివో V70 ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. అదే ఇలైట్ మోడల్‌ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 పైన పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ చిప్‌సెట్‌ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.

6500mAh బ్యాటరీ :
ఈ రెండు మోడల్స్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ సిరీస్‌ ఫోన్‌లు 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్లు బైపాస్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

ఈ సిరీస్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డి‌స్‌ప్లే 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 459 PPI పిక్సల్‌ డెన్సిటిని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ రెండు ఫోన్‌లు IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటాయి.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ సిరీస్‌ ఫోన్‌లు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo V70 series price and sale details tipped ahead of launch in February 19 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X