Home
Mobile

ఇవాళ్టి నుంచే సేల్‌.. 6500mAh బ్యాటరీ, 50MP + 50MP + 50MP కెమెరాలు సహా సూపర్‌ ఫీచర్లు..!

Vivo V70 Series Sale : వివో V70 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌ లో గత వారం లాంచ్‌ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లు 6500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 16 OS, 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు ఫోన్ల సేల్‌ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.

10 శాతం డిస్కౌంట్‌ :
వివో V70 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను వివో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. Yes బ్యాంకు, HDFC, SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. వివో V70 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.45999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.49999 గా ఉంది.

vivo V70 series sale

వివో V70 ఇలైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.51999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.56999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.61999 గా ఉంది. బేస్‌ వేరియంట్‌ ప్యాషన్‌ రెడ్, లెమన్‌ యెల్లో, ఇలైట్ మోడల్‌ ఫోన్‌ శాండ్ బీజ్‌, ప్యాషన్‌ రెడ్, అథెంటిక్ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తాయి.

స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6.59 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 459 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉన్నాయి. దీంతోపాటు IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉన్నాయి.

వివో V70 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. అదే ఇలైట్‌ వేరియంట్ 4nm స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

ఆండ్రాయిడ్ 16 OS :
ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తాయి. 4 సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతాయని వివో తెలిపింది. ఈ సిరీస్‌ ఫోన్లు 90W ఫ్లాష్‌ ఛార్జ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తాయి.

vivo V70 series sale

50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ రెండు ఫోన్‌లు Ziess భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌ (OIS), 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలున్నాయి. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo V70 series sale to start from today in india and gets 10 percent discount on bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X