Home
Mobile

వివో V70 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్‌.. ఎప్పుడు అందుబాటులోకి రానుంది?

Vivo V70 Series : వివో నుంచి భారత్‌ మార్కెట్‌లో వివో X200T స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల విడుదల అయింది. ప్రీమియం ధర సెగ్మెంట్‌లో ఈ ఫోన్ లాంచ్‌ అయింది. రేపటి నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. అయితే త్వరలో వివో నుంచి V70 సిరీస్‌ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, V70 ఇలైట్ మోడల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని వివరాలు కూడా వెల్లడయ్యాయి.

ఎంత ధరలో లాంచ్‌ కానుంది? :
భారత్‌ మార్కెట్‌లో ఈ సిరీస్‌ గురించి తాజాగా ధర సహా ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. వివో V70 మోడల్ రూ.40 వేల ధర సెగ్మెంట్‌లో, వివో V70 ఇలైట్‌ మోడల్‌ రూ.50 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Vivo V70 Series smartphones launch timeline

విడుదల వివరాలు! :
ఈ సిరీస్‌ విడుదల తేదీని వివో అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొన్ని లీక్స్, లిస్టింగ్స్‌ ఆధారంగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 తేదీల మధ్యలో సేల్‌ ప్రారంభం అ‌య్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం.

చిప్‌సెట్‌, OS వివరాలు! :
వివో V70 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 చిప్‌ తో పనిచేస్తుంది. అదే ఇలైట్‌ మోడల్‌ స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 3 SoC తో పనిచేస్తుంది. ఈ ఇలైట్‌ ఫోన్‌ చిప్‌ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ వివో సిరీస్ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.

ఏరోస్పేస్‌ గ్రేడ్! :
వివో V70 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌సెస్‌, HDR ను సపోర్టు చేస్తుంది. ఈ సిరీస్‌ ఏరోస్పేస్‌ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా వివో V70 సిరీస్‌ Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ సిరీస్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉంటాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలేజైషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ లెన్స్‌ ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 50MP నైట్‌ టెలిఫోటో కెమెరా, అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఈ కెమెరాలు 60fps 4K వీడియో రికార్డింగ్‌, 4K HDR వీడియో క్యాప్చర్‌ (డైనమిక్ రేంజ్‌) ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. AI Petal Shower, AI Magic Weather, AI Holi Portrait వంటి ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి.

Best Mobiles in India

English summary
Vivo V70 Series smartphones launch timeline, price and specifications tipped in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X