Vivo V70 Series : నాలుగు కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 1.5K డిస్‌ప్లేతో వివో 5G స్మార్ట్‌ఫోన్‌లు..!
Vivo V70 Series Launch Date : భారత్ మార్కె్టో వివో V70 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 6500mAh బ్యాటరీలు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ సిరీస్ విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
ఎప్పుడు విడుదల కానుంది :
వివో V70, వివో V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఫిబ్రవరి 19 వ తేదీ మధ్యాహ్నం 12PM గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్‌లు వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మైక్రోసైట్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

కలర్ వేరియంట్స్ :
వివిధ ప్లాట్‌ఫాంల ఆధారంగా ఈ సిరీస్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. వివో V70 స్మార్ట్‌ఫోన్ లెమన్ యెల్లో, ప్యాషన్ రెడ్ కలర్ వేరియంట్స్, V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్ శాండ్ బీజ్, అథెంటిక్ బ్లాక్, ప్యాషన్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
డిస్‌ప్లే వివరాలు :
వివో V70 సిరీస్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 459 ppi డెన్సిటి, 1.07 బిలియన్ కలర్స్‌ను సపోర్టు చేస్తుంది.
6500mAh బ్యాటరీ :
వివో V70 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్ పైన పనిచేస్తుంది. అదే ఇలైట్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి.

మూడు 50MP కెమెరాలతోపాటు :
కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యంతో కెమెరాలు ఉంటాయి. ఈ సిరీస్ కెమెరాలు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ లెన్స్ ఉంటుంది. దీంతోపాటు 50MP టెలిఫోటో లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంటుంది. అల్ట్రావైడ్ లెన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఈ సిరీస్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్లు రూ.50 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* గత నెలలో వివో X200T స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.69999 గా ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వైర్ ఛార్జింగ్, 45W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యం ఉంది. ఇందులో 50MP ప్రైమరీ (OIS) కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉంది. 32MP సెల్ఫీ కెమెరా ఉంది.


Click it and Unblock the Notifications








