Home
Mobile

50MP + 50MP + 50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 1.5K డిస్‌ప్లేతో వివో 5G ఫోన్‌ విడుదల..!

Vivo V70 Smartphone Launch : వివో V70 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌ లో ఇవాళ విడుదల అయింది. ఇందులో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్‌ స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ అయ్యాయి. వివో V70 5G స్మార్ట్‌ఫోన్ Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

వివో V70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 459 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది.

Vivo V70 Smartphone launched

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ వివో హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

Zeiss భాగస్వామ్యంతో కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, OIS సపోర్టుతో 50MP టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉన్నాయి.

సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 90W ఫ్లాష్‌ ఛార్జ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Vivo V70 Smartphone launched

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, NFC, GPS, NavlC, QZSS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌, ఇ-కంపాస్‌, ప్రాక్సిమిటీ సెన్సర్, టెంపరేచర్‌ సెన్సర్‌ లు ఉన్నాయి. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్ ఉంది.

వివో V70 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.45999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.49999 గా ఉంది. ఇవాళ్టి నుంచే వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని వివో తెలిపింది.

ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది. SBI, HDFC, యెస్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ప్యాషన్‌ రెడ్, లెమన్‌ యెల్లో కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V70 Smartphone launched with Snapdragon 7 Gen 4 Chip, 6500mAh Battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X