వివో నుంచి V70 సిరీస్ స్మా్ర్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, విడుదల వివరాలు..!
Vivo V70 Smartphone : వివో సంస్థ భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో T4 సిరీస్, Y సిరీస్, X300 సిరీస్, V50 సిరీస్, V60 సిరీస్ ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఇటీవలే వివో V60, V60e మోడల్స్ భారత్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వివో V60e స్మార్ట్‌ఫోన్ ఏకంగా 200MP కెమెరాను కలిగి ఉంది.
ఎప్పుడు విడుదల కానుంది :
అయితే వివో నుంచి త్వరలో V70 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వివో V70 ఇలైట్, V70 FE మోడల్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ ఈ వివరాలను వెల్లడించారు.

వివో V70 సిరీస్ అన్ని మోడల్స్ కూడా 5G కనెక్టివిటీతోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. దీంతోపాటు ప్రో, ప్రో ప్లస్ వెర్షన్‌లను కూడా విడుదల చేసే అవకాశం లేదని టిప్‌స్టర్ చెబుతున్నారు. అయితే ఇలైట్, FE మోడల్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రీబ్రాండెడ్ వెర్షన్‌గా :
భారత్ మార్కెట్‌లో వివో V70, V70 FE మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే గ్లోబల్ మార్కెట్‌లో V70 ఇలైట్, V70 లైట్ మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన వివో S50 మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా V70 ఫోన్ విడుదల కానుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. అయితే అదే నిజమైతే మాత్రం వివో V70 స్మార్ట్‌ఫోన్ 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.
కెమెరా విభాగం పరంగా వివో V70 ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 3X జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వివో V60e స్మార్ట్‌ఫోన్ :
వివో నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌లోకి వివో V60e స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 30x జూమ్‌తో 200MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, Aura లైట్, 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. Live Call Translation, AI Erase 3.0, AI Smart Call Assistant ఉన్నాయి.
ఈ ఫోన్ మీడియా డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.


Click it and Unblock the Notifications








