స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ZEISS కెమెరాలతో వివో V70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. పూర్తి వివరాలు..!
Vivo V70 Series : వివో సంస్థ భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం Y సిరీస్, V50, V60 సిరీస్ నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇటీవలే వివో X200T స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. త్వరలో సేల్ ప్రారంభం కానుంది. అయితే వివో నుంచి త్వరలో వివో నుంచి V70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ వివరాలు వివో అధికారికంగా వెల్లడించింది.
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ :
వివో V70 సిరీస్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ZEISS కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ZEISS ట్యూనింగ్‌తో కూడిన సోనీ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఎప్పుడు విడుదల కానున్నాయ్ :
వివో V70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటాయి. అయితే ఈ రెండు మోడల్స్ ఎప్పుడు లాంచ్ కానున్నాయనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌తో ఇలైట్ వేరియంట్ :
అయితే ఇటీవలే వివో సంస్థ V70 సిరీస్ విడుదలను అధికారికంగా ధ్రువీకరించింది. దీని ఆధారంగా V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ రూ.50000 ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ :
వివో V70 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌తో పనిచేసే అవకాశం ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుందని భావిస్తున్నారు. 55W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వివో V70, V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్‌లు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివో V70 స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ రూ.40 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఫిబ్రవరిలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
* ఇటీవల వివో X200T స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది. 50MP + 50MP + 50MP + 32MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉంది. వైర్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








