iPhone X డిజైన్‌తో వివో వి9, బడ్జెట్ ధరకే 24 ఎంపీ సెల్ఫీ షూటర్
చైనా మొబైల్‌మేకర్ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది.
చైనా మొబైల్‌మేకర్ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. కాగా ఆపిల్ iPhone X కన్నా చాలా తక్కువ ధరకే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. కాగా వివో వి9 పేరుతో ఇప్పటికే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేయగా నేడు భారత్‌మార్కెట్లో విడుదల చేసింది. బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.22,990 గా నిర్ణయించింది. ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
వివో వి9 ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ ప్లే 19.9 యాస్పెక్ట్ రేషియో
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్
1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్
4జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+5 ఎంపీ డ్యుయల్ రియల్ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్ బ్యాటరీ

ఇదిలా ఉంటే వివో తన స్మార్ట్‌ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను నియమించుకుంది. ఈ విషయంపై అమీర్‌ఖాన్ ఇప్పటికే తమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని వివో ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ ద్వారా తెలియజేసింది. భవిష్యత్‌లో విడుదల కానున్న అన్ని వివో ఉత్పత్తులకు అమీర్‌ఖాన్ ప్రచారకర్తగా ఉంటారని, త్వరలో ఓ కొత్త టీవీ యాడ్‌లోనూ అమీర్ నటిస్తారని వివో పేర్కొంది. రెండేళ్ల కాలానికి గాను బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందం గత నెల కిందటే ముగిసిందని, అందుకే ఆయన స్థానంలో అమీర్‌ఖాన్‌ను తమ ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వివో ఇండియా సీఎంవో కెన్నీ జెంగ్ తెలిపారు.
వివో ఉత్పత్తుల ప్రచారానికి అమీర్‌ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని, ఇది తమ కస్టమర్ బేస్‌ను మరింత పెంచుతుందని కెన్నీ జెంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై నటుడు అమీర్‌ఖాన్ స్పందిస్తూ గడిచిన ఏళ్లలో వివో ప్రజలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసిందని అన్నారు. స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ రంగానికి ఉన్న హద్దులను వివో చెరిపివేస్తుందని, తన వినియోగదారులకు నూతన తరహా స్మార్ట్‌ఫోన్ అనుభూతిని ఎప్పటికప్పుడు అందిస్తుందని అన్నారు. వివో ఇండియా ప్రయాణంలో తాను భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications








