24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫోన్ రూ. 2 వేలు తగ్గింది
చైనా దిగ్గజం వివో తన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో వీ9 ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీద రెండు వేల రూపాయలు తగ్గిస్తున్నట్టు వివో ప్రకటించింది.
చైనా దిగ్గజం వివో తన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో వీ9 ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీద రెండు వేల రూపాయలు తగ్గిస్తున్నట్టు వివో ప్రకటించింది. కాగా ఈ ఏడాది మార్చిలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర 22,990 రూపాయలుంటే, ధర తగ్గింపు అనంతరం రూ. 20,990కు విక్రయానికి వచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, వివో ఈ-స్టోర్ అన్ని ఛానల్స్‌లోనూ కొత్త ధరలోనే వివో వీ9 లభ్యమవుతుంది. ఇండియాలో ఒక్క వేరియంట్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఇటీవలే కొత్త మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్‌చేసింది. కాగా ఈ ధర తగ్గింపు విషయాన్ని వివో గాడ్జెట్స్ 360కి ధృవీకరించింది.

వివో వీ9 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, ఐఫోన్ ఎక్స్ మాదిరి డిస్‌ప్లే నాచ్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
6.30 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా వ్యూయింగ్ సౌకర్యం టీవీలో చూసినట్లుగా కనిపిస్తుంది. దీనికి పై భాగంలో ఐఫోన్ X తరహాలో నాచ్‌ను ఏర్పాటు చేశారు.

24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరా
ఫోన్ వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను అమర్చారు. సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీని వల్ల ఈ కెమెరాతో డివైస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్ ముఖాన్ని స్కాన్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది.

ఆర్ స్టిక్కర్స్ అనే ఫీచర్
ఈ ఫోన్‌లో ఏఆర్ స్టిక్కర్స్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు సెల్ఫీ కెమెరాతో తీసుకునే తమ ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డ్, డ్యుయల్ సిమ్ కార్డుల కోసం వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు.

వి9 యూత్
లేటెస్ట్‌గా కంపెనీ వి9 యూత్‌ను విడుదల చేసింది. ఇందులో 6.3 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఐఫోన్ 10 తరహాలో ఈ ఫోన్‌కు డిస్‌ప్లే పై భాగంలో నాచ్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు.

రూ.18,990 ధర
వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పవర్‌ఫుల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. పెరల్ బ్లాక్, షాంపేన్ గోల్డ్ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ రూ.18,990 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది.

వివో వి9 యూత్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








