ధర తగ్గింపును అందుకున్న వివో స్మార్ట్‌ఫోన్లు ఇవే
ప్రముఖ మొబైల్ దిగ్గజం వివో తమ స్మార్ట్‌ఫోన్ల పై మరోసారి తగ్గింపును అందించింది.
ప్రముఖ మొబైల్ దిగ్గజం వివో తమ స్మార్ట్‌ఫోన్ల పై మరోసారి తగ్గింపును అందించింది. తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో ఈ దిగ్గజ బ్రాండ్ తమ స్మార్ట్‌ఫోన్ల అయిన Vivo V9, Vivo Y83, Vivo X21 పై తగ్గింపు ధరను ప్రకటించింది.ఈ నేపథ్యంలో వివో మరో సరికొత్త ఫోన్ ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది.సెప్టెంబర్ 6ను Vivo V11 Pro పేరుతో ఇండియా మార్కెట్ లోకి లాంచ్ చేయబోతుంది. అధునాతనమైన ఫీచర్లతో ఈ Vivo V11 Pro మార్కెట్లోకి రాబోతున్నట్టు కంపెనీ తెలిపింది.మరి కంపెనీ ప్రకటించిన తగ్గింపు ధరను ఓ సారి పరిశీలిస్తే...

Vivo V9
అసలు ధర రూ. 22,990
ప్రస్తుత ధర రూ . 18,990
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 24 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y83
అసలు ధర రూ. 14,990
ప్రస్తుత ధర రూ. 13,990
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Mediatek Helio P22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ , డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2,4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo X21
అసలు ధర రూ. 35,990
ప్రస్తుత ధర రూ. 31,990
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo V11 Pro ఫీచర్లు (అంచనా)
6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








