అమెజాన్‌లో వింటర్ కార్నివాల్ పేరిట వివో ఫోన్లపై ఆఫర్లు
అమెజాన్ లో మళ్లీ ఆఫర్ల సందడి మొదలైంది. చైనా దిగ్గజ మొబైల్ సంస్థ వివో వింటర్ కార్నివాల్ పేరిట ప్రత్యేక ఆఫర్లను యూజర్లకు అందిస్తోంది.
అమెజాన్ లో మళ్లీ ఆఫర్ల సందడి మొదలైంది. చైనా దిగ్గజ మొబైల్ సంస్థ వివో వింటర్ కార్నివాల్ పేరిట ప్రత్యేక ఆఫర్లను యూజర్లకు అందిస్తోంది. వివోకు చెందిన వీ7 ప్లస్, వీ5ఎస్, వీ5 ప్లస్, వై69, వై66, వై53, వై55ఎస్ ఫోన్లను కొనే యూజర్లకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ఆఫర్లు లభిస్తాయి.

Vivo V7+
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్ మీద మీరు రూ.2 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీని అసలు ధర రూ. 21,900
స్పెషిఫికేషన్స్
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

అమెజాన్ పే వాలెట్ ద్వారా..
అమెజాన్ పే వాలెట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి వివో ఫోన్‌ను కొంటే అదనంగా మరో రూ.2వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

బుక్ మై షో ద్వారా సినిమా టిక్కెట్లను..
అలాగే పైన చెప్పిన వివో ఫోన్లను కొన్న యూజర్లకు బుక్ మై షో ద్వారా సినిమా టిక్కెట్లను ఉచితంగా అందివ్వనున్నారు.

స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను..
వివోకు చెందిన వీ7 ప్లస్ ఫోన్‌పై ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొంటే స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఏడాదిలో ఒకసారి ఉచితంగా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








