భారత్ మార్కెట్‌లోకి వివో నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు.. స్పెసిఫికేషన్ల వివరాలు..!
వివో నుంచి త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. సంస్థ తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను (Vivo X Fold 3 Pro Smartphone) భారత్ మార్కెట్‌లోకి జూన్ 6న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు అందుబాటులో ఉండనుంది.
చైనాలో ఇప్పటికే విడుదల :
ఇప్పటికే ఈ వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదల అయింది. అయితే భారత్ మార్కెట్‌లో తొలిసారిగా వివో సంస్థ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. చైనాలో వివో X ఫోల్డ్ 3 ప్రో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర CNY 9999 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,16,000) గా ఉంది.

వివో X ఫోల్డ్ 3 ప్రో అంచనా స్పెసిఫికేషన్‌లు :
చైనాలో లాంచ్ అయిన వేరియంట్ ఆధారంగా వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ 8.03 అంగుళాల 2k (2200*2480) అమోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లే మరియు 6.53 అంగుళాల (1172*2748) అమోలెడ్ కవర్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS :
ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Origin OS 4, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్ సెట్ పైన పనిచేస్తుంది. 16GB LPDDR5X ర్యామ్ మరియు గరిష్ఠంగా 1TB UFS4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది. దీంతోపాటు వివో V3 ఇమేజింగ్ చిప్‌ను కూడా కలిగి ఉంటుంది.
100W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో :
వివో X ఫోల్డ్ 3 ప్రో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు Zeiss బ్రాండ్‌తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు మరిన్ని కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను లో చైనాలో లాంచ్ అయింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
అయితే జూన్ 6వ తేదీన భారత్‌లో విడుదల కానున్న వివో X ఫోల్డ్ 3 ప్రో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు గురించి సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. సుమారుగా చైనా వేరియంట్ తరహాలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








