Home
Mobile

వివో నుంచి భారత్‌లోకి తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌.. 8.03 అంగుళాల డిస్‌ప్లే, 5700mAh బ్యాటరీ సహా..!

వివో సంస్థ భారత్‌ మార్కెట్‌లో తొలిసారిగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో X ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 pro Smartphone) స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో ఇవాళ లాంచ్‌ అయింది. ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 5700mAh బ్యాటరీతో విడుదల అయింది. మరియు Zeiss బ్రాండ్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

భారత్‌లో వివో తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ 8.03 అంగుళాల ప్రధాన 2K E7 అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, డాల్బీ విజన్‌, HDR10 సపోర్టుతో వచ్చింది. దీంతోపాటు 6.53 అంగుళాల అమోలెడ్‌ కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 90.92 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది.

Vivo X Fold 3 pro Foldable smartphone launched in india

వివో X ఫోల్డ్‌ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 16GB LPDDR5X ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. వివో X ఫోల్డ్‌ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ 100W వైర్, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరాల పరంగా ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ Zeiss బ్రాండ్‌తో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.68 అపేచర్‌ మరియు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో వచ్చింది. 3X జూమింగ్‌తో 64MP టెలిస్కోప్‌ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. కవర్‌ డిస్‌ప్లే మరియు ప్రధాన డిస్‌ప్లేలు 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.

Vivo X Fold 3 pro Foldable smartphone launched in india

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, NFC, GPS, OTG, USB-C, QZSS వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఫ్లిక్కర్‌ సెన్సార్‌, గైరో, ఎలక్ట్రానిక్‌ కంపాస్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. IPX8 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో వచ్చింది.

వివో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం 16GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర రూ.1,59,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Celestial Black రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫాంల ద్వారా ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు.

ప్రారంభ ఆఫర్‌ కింద వివో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను SBI, HDFC కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.15000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ.10000 ఎక్స్చేంజీ బోనస్‌, ఒకసారి ఉచితంగా స్క్రీన్‌ను రీప్లేస్‌ చేసుకొనే అవకాశం ఉంది. 24 నెలలపాటు నో-కాస్ట్‌ EMI సదుపాయం ఉంది. జూన్ 17 నుంచి వివో సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ ద్వారా రూ.5999 విలువైన వివో వైర్‌లెస్ ఛార్జర్‌ 2.0 అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo X Fold 3 pro Foldable smartphone launched in india price specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X