Home
Mobile

వివో కొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ లీక్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు..!!

వివో నుంచి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలో విడుదల కానుంది. వివో X ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 Pro Smartphone) హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు సంస్థ ధ్రువీకరించింది. మైస్మార్ట్‌ప్రైస్‌ నివేదిక ఆధారంగా ఈ వివో ఫోల్డబుల్‌ జూన్‌ నెల తొలిరోజుల్లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పుడు లాంచ్‌ కానుందో వెల్లడించలేదు.

ఈ వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ ఇటీవల బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (BIS) సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌ లో కనిపించింది. ఈ హ్యాండ్‌ సెట్ ఇటీవలే చైనాలో విడుదల అయింది. దీని ఆధారంగా భారత్‌ వేరియంట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై అంచనా కథనం మీకోసం.

Vivo X Fold 3 Pro Smartphone india launch expected in june 2024

వివో X ఫోల్డ్‌ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్ అంచనా స్పెసిఫికేషన్లు :
వివో X ఫోల్డ్‌ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్ 6.53 అంగుళాల అమోలెడ్ కవర్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుందని తెలుస్తోంది. అదే ప్రధాన డిస్‌ప్లే విషయానికి వస్తే 8.03 అంగుళాల అమోలెడ్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ వివో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ 4nm స్మా్ప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌ సెట్‌తో అడెన్నో 750 GPU జతచేయబడుతుందని సమాచారం. దీంతోపాటు ఈ హ్యాండ్‌ సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ మెరుగైన ఫీచర్‌ లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

5700mAh బ్యాటరీ సామర్థ్యం : దీంతోపాటు ఈ హ్యాండ్‌ సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W వైర్ మరియు 50W వైర్‌ లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కనెక్టివిటీ పరంగా ఈ వివో X ఫోల్డ్‌ 3 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ బ్లూటూత్‌ 5.4, Wi-Fi 7, NFC మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ భారత్‌ వేరియంట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పైన వివో సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

వివో X ఫోల్డ్ 3 స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌ వేరియంట్‌పై ఎటువంటి వివరాలు లీక్ కాలేదు. అయితే చైనాలో ఈ హ్యాండ్‌సెట్ ధర 9999 yuan లుగా ఉంది. భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.1,17,800 గా ఉంది. అయితే భారత్‌ వేరియంట్‌ ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X Fold 3 Pro Smartphone india launch leaked here are the expected specs and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X