వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లాంచ్ వివరాలు..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ (Vivo X Fold 3 Pro Smartphone) భారత్‌లో విడుదల ఖరారు అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లైవ్ పేజీతోపాటు వివో టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే కచ్చితమైన విడుదల తేదీని సంస్థ వెల్లడించలేదు.
ఫ్లిప్‌కార్ట్, వివో తన X పోస్ట్ ద్వారా ఈ వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్ కలర్‌ను కలిగి ఉంది. మరియు వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను గుర్తించవచ్చు. అయితే భారత్ వేరియంట్‌పై సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. చైనాలో ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది.

వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్లు :
వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ 8.03 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే మరియు 6.53 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.
ఈ వివో ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కస్టమ్ Vivo OS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 4nm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడిటింగ్ టూల్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో లాంచ్ కానుందని సమాచారం.
దీంతోపాటు ఈ వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 100W వైర్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు కనెక్టివిటీ పరంగా వైఫై 7, బ్లూటూత్ 5.4, NFC, USB-C వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం.
వివో X ఫోల్డ్ 3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ చైనా లో ప్రారంభం ధర 9999 yuan గా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.1.17 లక్షలుగా ఉంటుంది. అయితే భారత్ వేరియంట్ ధరపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. దాంతోపాటు పైన తెలిపిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై సంస్థ ఎటువంటి ప్రకటన జారీచేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








