Vivo X Fold 5 : వివో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఇవాళ్టి నుంచే ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు..!
Vivo X Fold 5 Foldable Smartphone : వివో నుంచి ఇవాళ వివో X200 FE స్మార్ట్‌ఫోన్, వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. X200 FE మోడల్ కాంపాక్ట్ డిజైన్‌లో విడుదల అయింది. మరో ఫోన్ బుక్ స్టైల్ ఫోల్డబుల్ మోడల్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 6000mAh బ్యాటరీతో పాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ప్రీ ఆర్డర్ చేసుకొనేందుకు వివో అవకాశం కల్పించింది.
వివో X ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 8.03 అంగుళాల అమోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 6.53 అంగుళాల అమోలెడ్ కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేలు 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి.

ఈ ఫోన్ TUV Rheinland గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 3.0, Zeiss మాస్టర్ కలర్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫోల్డింగ్ సమయంలో థిక్‌నెస్ 9.2mm గా ఉంది. అదే అన్‌ఫోల్డింగ్ సమయంలో 4.3mm గా ఉంది. ఈ ఫోన్ 217 గ్రాములుగా ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది.

ఆకట్టుకొనే కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ f/1.57 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, f/2.05 అపేచర్‌తో 50MP శాంసంగ్ JN1 అల్ట్రావైడ్ కెమెరా మరియు 100x డిజిటల్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్, f/2.55 అపేచర్‌తో 50MP సోనీ IMX882 టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.
6000mAh బ్యాటరీ :
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.4 అపేచర్‌తో ఇన్నర్, కవర్ డిస్‌ప్లేలపై 20MP సెల్ఫీ కెమెరాలను అమర్చింది. ఈ వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ AI ఇమేజ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ బుక్ స్టైల్ వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 80W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, OTG, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IPX8, IPX9, IP5X రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,49,999 గా ఉంది. ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్ (Pre Order) చేసుకోవచ్చు.
ఈ ఫోన్ టైటానియం కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ సేల్ జులై 30 నుంచి ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








