Home
Mobile

వివో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్... ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ప్రత్యేక డిజైన్ సహా సూపర్‌ ఫీచర్‌లు..!

Vivo X Fold 5 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇటీవలే ఈ మోడల్‌ చైనా మార్కెట్‌లో లాంచ్ అయింది. వివో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ తోపాటు వివో X200 FE మోడల్‌ను కూడా లాంచ్‌ కానుంది. వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ వివో అధికారిక స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది.

ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా :
వివో X ఫోల్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ కార్బన్‌ ఫైబర్‌ హింజ్‌ల సపోర్టును కలిగి ఉంది. మరియు ఏకంగా 6,00,000 ఫోల్డ్స్‌ను తట్టుకుంటుందని తెలుస్తోంది. ఫలితంగా రగ్గడ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

Vivo X Fold 5 smartphone to launch soon in india here are the specifications and features

స్లిమ్‌ ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ IPX8, IPX9 వాటర్‌ రెసిస్టెన్స్‌తోపాటు IP5X డస్ట్‌ రెసిస్టెన్స్‌ మరియు -20 డిగ్రీల సెల్సియస్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ప్రొటెక్షన్‌తోపాటు స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫోల్డ్‌ గా ఉన్నప్పుడు ఈ ఫోన్‌ 9.2mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అదే అన్‌ఫోల్డ్‌ సమయంలో 4.3mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ :
వివో X ఫోల్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు 80W వైర్‌, 40W వైర్‌లెస్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh డ్యూయల్‌ సెల్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

కెమెరాలు :
ఇందులో f/5.7 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3X టెలిఫోటో కెమెరాతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ రెండు 20MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ఒకటి ఇన్నర్‌, మరొకటి కవర్‌ డిస్‌ప్లే పైన ఉంటుంది.

షార్ట్‌కట్‌ బటన్‌ :
వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ షార్ట్‌కట్‌ బటన్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా యాప్స్ వినియోగం సహా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ త్వరలోనే విడుదల కానుందని తెలుస్తున్నా.. కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు.

Take a Poll

* ఇటీవలే వివో నుంచి T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌, MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌ యూనిట్‌ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వివో స్మార్ట్‌ఫోన్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. సేల్‌ జులై 2 నుంచి ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X Fold 5 smartphone to launch soon in india here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X