Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
5న తెలంగాణ కేబినెట్ భేటీ: బడ్జెట్ ఆమోదం
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Vivo నుంచి రాబోయే ఫోల్డబుల్‌కు క్వాడ్ కెమెరా సెటప్! లాంచ్ ఎప్పుడంటే!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ Vivo, ఫోల్డబుల్ మొబైల్ సెగ్‌మెంట్‌పై కాస్త చురుకుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ కంపెనీ నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా Vivo X ఫోల్డ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ బ్రాండ్ మరొక ఫోల్డబుల్ మోడల్‌పై పనిచేస్తోందని పలు నివేదికలు వెల్లడించాయి. ఆ కొత్త ఫోల్డబుల్ మొబైల్ త్వరలో హోమ్ మార్కెట్ అయిన చైనాలో ప్రారంభమవుతుందని పేర్కొన్నాయి.

ఈ రాబోయే కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను ఇప్పటివరకు Vivo X Fold S అని పిలవగా.. ఇప్పుడు, ఈ డివైజ్‌ను Vivo X Fold Plus అని కూడా పిలవవచ్చని ఓ టిప్‌స్టర్ ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా, ఈ రాబోయే ఫోన్ కెమెరా వివరాలు కూడా లీకయ్యాయి. ఇప్పటికే, ఈ Vivo X Fold Plus గతంలో చైనా 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ మరియు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లో గుర్తించబడినట్లు కూడా పలు రూమర్లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు Qualcomm Snapdragon 8+ Gen 1 SoC చిప్‌సెట్, 2K LTPO డిస్‌ప్లేను అందిస్తున్నట్లు టిప్‌స్టర్ ఇంతకు ముందు పేర్కొన్నాడు.

క్వాడ్ కెమెరా సెటప్‌తో రానుంది(లీక్)!
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, రాబోయే వివో ఫోల్డబుల్ ఫోన్‌ను Vivo X Fold Plus అని పిలుస్తారని, అది Vivo X ఫోల్డ్ S కాదు అని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు.
50 మెగాపిక్సెల్‌తో ప్రధాన కెమెరా!
ఈ రాబోయే Vivo X Fold Plus స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తోంది. మొదటగా 50MP క్వాలిటీతో ప్రధాన కెమెరా లెన్స్ ను కలిగి ఉంటుంది. దీని తర్వాత రెండోది 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, మూడో కెమెరా 12MP పోర్ట్రెయిట్ లెన్స్ కలిగి ఉంటాయి. ఇక చివరగా, 8MP పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. పెరిస్కోప్ లెన్స్ 5x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది, అయితే పోర్ట్రెయిట్ లెన్స్ 2x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. సెల్ఫీలు తీసుకోవడానికి మరియు వీడియో కాల్స్ చేయడానికి ముందు భాగంలో 16MP క్వాలిటీ కలిగిన కెమెరాను కలిగి ఉంటుంది.

Vivo X Fold Plus లీక్‌డ్ స్పెసిఫికేషన్లు:
డిజైన్ విషయానికొస్తే.. ఈ రాబోయే కొత్త ఫోన్ మునుపటి X ఫోల్డ్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది 8.03-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానెల్ తో వస్తోంది. అంతేకాకుండా, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.53-అంగుళాల కవర్ డిస్‌ప్లే అందించనున్నారు. అదనపు భద్రతను అందించే డ్యుయల్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌లు ఇస్తున్నారని టిప్‌స్టర్ ఇదువరకే వెల్లడించారు.
ఈ డివైజ్ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని టిప్‌స్టర్ పునరుద్ఘాటించారు. ఇది Snapdragon 8 Gen 1 SoCని కలిగి ఉన్న Vivo X ఫోల్డ్ కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. బ్యాటరీ కూడా మునుపటి కంటే 100mAh అప్‌గ్రేడ్ చేయబడుతుందని తెలిపారు. X Fold Plus 4,700mAh డ్యూయల్-సెల్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉందని, X ఫోల్డ్ కంటే 14W వేగవంతమైనదిగా చెప్పబడింది. ఇది 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది.Vivo కంపెనీ ఇంకా Vivo X Fold Plus యొక్క లాంచ్ తేదీని అధికారికంగా వెల్లడించలేదు, అయితే లీక్‌లు ప్రకారం చూస్తే.. ఈ నెలలోపు లాంచ్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470