Home
Mobile

వివో X ఫోల్డ్5 లాంచ్.. 120Hz డ్యూయల్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3, 6000mAh బ్యాటరీ..!

vivo X Fold5: వివో తన అత్యంత అడ్వాన్స్‌డ్ ఫోల్డబుల్ ఫోన్, వివో X ఫోల్డ్5 ను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ డ్యూయల్ LTPO AMOLED డిస్‌ప్లేలు, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, ఇంతవరకూ ఏ ఫోల్డబుల్ ఫోన్‌లోనూ చూడని IP5X, IPX8, IPX9, IPX9+ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్‌ను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీ సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

ఫోల్డబుల్ డిజైన్‌లో శక్తివంతమైన చిప్‌సెట్, మెరుగైన ఫీచర్లు సహా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ఫోన్‌ కావాలని భావిస్తున్న వారికి ఈ వివో X ఫోల్డ్‌5 ఆకట్టుకొనే అవకాశం ఉంది. వివో X ఫోల్డ్5.. 8.03 అంగుళాల 2K+ ఫ్లెక్సిబుల్ AMOLED ఇన్నర్‌ స్క్రీన్, 6.53-అంగుళాల FHD+ కవర్‌ డిస్‌ప్లే ఉన్నాయి.

vivo X Fold5

రెండు స్క్రీన్లు LTPO టెక్నాలజీ సపోర్టును కలిగి ఉన్నాయి. 1Hz-120Hz మధ్య రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇన్నర్‌ స్క్రీన్‌ UTG గ్లాస్, కవర్‌ డిస్‌ప్లే ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మరియు ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది.

ఫ్లాగ్‌షిప్ పవర్, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ : ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా వేడెక్కకుండా 20762mm² వేపర్ ఛాంబర్, గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. 16GB LPDDR5X RAM, 1TB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5 ను కలిగి ఉంది.

హింజ్ యాంటెన్నా : ఈ ఫోన్‌లో హింజ్ యాంటెన్నా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది సిగ్నల్‌ను మెరుగుపరుస్తుంది. ఫోన్ తెరిచి ఉన్నప్పుడు రెండు స్క్రీన్ల యాంటెన్నాలు స్వతంత్రంగా పనిచేస్తాయి, మడిచినప్పుడు రెండూ కలిసిపోయి సిగ్నల్‌ను ఏకంగా 36% పెంచుతాయి.

vivo X Fold5

అంతేకాదు, ఈ ఫోన్ ఆపిల్ డివైజ్‌లతో కూడా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. కాల్స్, మెసేజ్‌లు, ఆపిల్ వాచ్‌తో హెల్త్ డేటా సింక్, మాక్ నుండి ఫైల్ యాక్సెస్ కూడా చేయొచ్చు. ఐఫోన్ యూజర్లు దీని హాట్‌స్పాట్‌కు కనెక్ట్ అవ్వడమే కాకుండా, కాల్స్, మెసేజ్‌లను ఈ ఫోల్డబుల్ నుంచే మేనేజ్ చేసుకోవచ్చు.

Zeiss కెమెరాలు : ఈ ఫోన్‌లో వెనుక వైపు ట్రిపుల్ 50MP కెమెరాలున్నాయి. OIS సపోర్టుతో సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 3x టెలిఫొటో పెరిస్కోప్ లెన్స్, అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇన్నర్, కవర్‌ డిస్‌ప్లేలలో 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి, ఇవి హై-క్వాలిటీ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఉపయోగపడతాయి.

vivo X Fold5

భారీ బ్యాటరీ, నెక్స్ట్-జెన్ టెక్నాలజీ : ఈ ఫోన్‌ 6000mAh బ్లూ ఓషన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 4వ తరం సిలికాన్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్, సెమీ సాలిడ్-స్టేట్ టెక్నాలజీతో తయారుచేశారు. 80W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. -30°C చలిలోనూ ఈ బ్యాటరీ పనిచేస్తుంది.

ఈ వివో ఫోన్‌ IPX8, IPX9, IPX9+ వాటర్‌ ప్రూఫ్‌, IP5X డస్ట్ ప్రొటెక్షన్ ఉన్న తొలి ఫోల్డబుల్ ఫోన్‌గా గుర్తింపు పొందినట్లు వివో చెబుతోంది. హై ప్రెజర్ వాటర్ జెట్స్, 80°C వేడి నీళ్లలోనూ ఈ ఫోన్‌ డ్యామేజీ కాదని వివో చెబుతోంది. -20°C చలిలోనూ పనిచేస్తుంది.

ధర, సేల్‌ వివరాలు : వివో X ఫోల్డ్5 గ్రీన్ పైన్, వైట్, టైటానియం కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 6,999 ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.84,000), 16GB ర్యామ్‌ +1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 9,499 ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.14 లక్షలు). ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలోనే అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో వివో X ఫోల్డ్5 లాంచ్ ఎప్పుడంటే : వివో X ఫోల్డ్5 ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. వివో X ఫోల్డ్5 తాజాగా BIS సర్టిఫికేషన్ సైట్‌లో కూడా కనిపించింది. లాంచ్ తేదీల గురించి వస్తున్న అప్‌డేట్స్ ఆధారంగా జులై రెండో, మూడు వారాల్లో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో లాంచ్ కావొచ్చట.

Best Mobiles in India

English summary
vivo X Fold5 Launched with 120Hz Dual LTPO Displays, Snapdragon 8 Gen 3, and 6000mAh Battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X