Vivo X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ట్రిపుల్ కెమెరా, 5400mAh బ్యాటరీ, 16GB ర్యామ్..!
వివో X100 మరియు వివో X100 ప్రో స్మార్ట్‌ఫోన్లు (Vivo X100 series) భారత్‌లో విడుదల అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoC చిప్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 6.78 అంగుళాల 8 LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరియు వాటర్, డస్ట్ రెసిస్టన్స్ IP68 రేటింగ్‌తో అందుబాటులోకి రానున్నాయి.
వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు : ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. వివో కొత్త V3 ఇమేజింగ్ చిప్ మరియు 16GB LPDDR5X ర్యామ్, G720 GPUతో జతచేయబడుతుంది.

మరియు 6.78 అంగుళాల అమోలెడ్ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1260*2800 పిక్సల్ డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌తో వస్తుంది. 2160 Hz హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ మరియు 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) 50MP సోనీ IMX989 1 అంగుళాల సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50MP Zeiss APO సూపర్ టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS సపోర్టుతో వస్తుంది. మరియు టెలీఫోటో కెమెరా 4.3X ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది. ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

వివో X100 ప్రో 100W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 7, బ్లూటూత్ 5.4, GPS, OTG, USB-C యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి సెన్సార్లను కలిగి ఉంది. మరియు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
వివో X100 : ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14 పైన పనిచేస్తుంది. మరియు 6.78 అంగుళాల అమోలెడ్ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. 16GB LPDDRX ర్యామ్ మరియు వివో V2 చిప్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ ఫోన్ OIS సపోర్టుతో 50MP సోనీ IMX920 VCS బయోనిక్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 100X జూమ్‌తో 64MP Zeiss సూపర్ టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. 120Hz ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
వివో X100 సిరీస్ ధర, లభ్యత వివరాలు : వివో X100 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.63,999గా ఉంది. అదే 16GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది. అదే వివో X100 ప్రో స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్, 512GB స్టోరేజీ వేరియంట్‌లోనే లభిస్తుంది.
వివో X100 ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌గేజ్ బ్లూ రంగుల్లో.. అదే ప్రో మోడల్ ఆస్టరాయిడ్ బ్లూ రంగులో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫోన్లను ముందస్తు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. జనవరి 11 నుంచి ఫ్లిప్‌కార్ట్, వినో ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI, ICICI, HDFC, IDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








