డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో Vivo X20 Plus UD

చైనా మొబైల్స్ దిగ్గజం ఒప్పో తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివో 'ఎక్స్20 ప్లస్ యూడీ ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది.

By Hazarath
|

చైనా మొబైల్స్ దిగ్గజం ఒప్పో తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివో 'ఎక్స్20 ప్లస్ యూడీ ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. అక్కడ ఈఫొన్ ధరను కంపెనీ రూ.36,090గా నిర్ణయించింది. ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే అన్ని స్మార్ట్‌ఫోన్లలో మాదిరి కాకుండా డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. దీంతో డిస్‌ప్లేపై చేతి వేలితో టచ్ చేస్తే చాలు, డివైస్ అన్‌లాక్ అవుతుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.6.43 ఇంచ్ భారీ డిస్‌ప్లేతో పాటు వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు ఉన్నాయి. అలాగే 3905 కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Vivo X20 Plus UD

వివో ఎక్స్20 ప్లస్ యూడీ ఫీచర్లు
6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3905 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వివో వీ5 ప్లస్

వివో వీ5 ప్లస్

వివో వీ 5 ప్లస్ 5.5 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో 1080 పిక్సల్ తో వచ్చింది. 2.5 కర్వ్డ్ గ్లాస్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అదనపు ఆకర్షణగా నిలవనుంది.4జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంటర్నల్ స్టోరేజి విషయానికొస్తే 64 జిబి ఆన్ బోర్డ్ స్టోరేజి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ చిప్ సెట్ ని ఇందులో పొందుపరిచారు.కెమెరా విషయానికొస్తే డ్యూయెల్ సెల్పీ కెమెరాతో ఫోన్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఒకటి 8 ఎంపీ మరొకటి 20 ఎంపీ Sony IMX376 1/2.78-inch sensor సెల్పీ కెమెరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటుంది. 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే 3,160 mAh బ్యాటరీ. ఇది వివో డ్యూయెల్ ఛార్జింగ్ ఇంజిన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్ ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది.ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో వంటివి అదనపు ఫీచర్లు. దీని అమ్మకాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి ఫ్రీ బుకింగ్ ఆర్డర్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది.

వివో వీ7

వివో వీ7

ధర రూ. 16,990

వివో వీ7 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

వీ7 ప్లస్

వీ7 ప్లస్

ధర రూ.21990

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 20, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.డ్యూయెల్ లెన్స్ సిస్టంతో వస్తున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదేనని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే వివో వీ5 సెల్ఫీ కెమెరాతో అదరగొట్టిన సంగతి విదితమే.

వీ5ఎస్

వీ5ఎస్

ధర రూ. 15,990
వివో వీ5ఎస్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x1280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫన్‌టచ్ 3.0 ఓఎస్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. 1.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ప్లాష్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో ఫ్లాష్, సెల్ఫీస్, వీడియో కాలింగ్), 3000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో), కంపాస్ మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ఫోన్ బరువు 154 గ్రాములు. కొలత 153.80 x 75.50 x 7.55 మిల్లీ మీటర్లు.

వివో వై66

వివో వై66

అసలు ధర రూ. 14,990 తగ్గింపు రూ. 2000 ఇప్పటి ధర రూ. 12,990

వివో వై66 ప్రత్యేకతలు..

మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల హైడిఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టం, , 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్.

Best Mobiles in India

English summary
Vivo X20 Plus UD with in-display fingerprint scanner launched in China more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X