ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెండు Vivo ఫోన్‌లు ఇవాళ విడుదల కానున్నాయ్.. అదిరిపోయే డిజైన్, సూపర్ ఫీచర్లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇవాళ భారత్ మార్కెట్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. వివో X200 FE (Vivo X200 FE Smartphone), వివో X ఫోల్డ్ 5 (Vivo X Fold 5 Smartphone) స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌ల కోసం ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.
వివో X200 FE, వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్లు జులై 14 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. విడుదల సమయంలో సేల్ తేదీ, ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.

* వివో X200 FE స్మార్ట్‌ఫోన్ :
నివో X200 FE స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది.
6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 6.31 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 186 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.
Zeiss బ్రాండ్ :
కెమెరా విభాగం పరంగా Zeiss బ్రాండ్ భాగస్వామ్యంతో 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ వివో X200 FE స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులో ఉంటుంది. IP68+ IP69 రేటింగ్‌తో విడుదల కానుంది.
ధర వివరాలు లీక్ :
టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ ఈ ఫోన్ ధర వివరాలను లీక్ చేశారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.54999 గా ఉంటుందని తెలిపారు. అయితే బ్యాంకు ఆఫర్లతో రూ.49999 కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మరియు 12GB/256GB, 16GB/ 512GB స్టోరేజీ వేరియంట్స్‌లోనూ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
* వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ :
వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ ఇటీవలే చైనాలో విడుదల అయింది. ఈ ఫోన్ 8.03 అంగుళాల 2K+ LTPO అమోలెడ్ ప్రైమరీ డిస్‌ప్లే. 6.53 అంగుళాల ఫుల్ HD+ LTPO అమోలెడ్ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, Adreno 750 GPU ను తో పనిచేస్తోంది.
చైనా వేరియంట్ కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX921 (OIS), 50MP శాంసంగ్ JN1 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50MP IMX882 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. భారత్‌లోనూ ఇదే తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








