వివో నుంచి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. తాజాగా ధర వివరాలు లీక్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
భారత్ మార్కెట్‌లో వివో నుంచి జులై 14 వ తేదీన వివో X ఫోల్డ్ 5, వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. విడుదల అనంతరం వివో ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు భారీ బ్యాటరీలతో అందుబాటులోకి రానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్స్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడవ్వగా.. తాజాగా వీటి ధర వివరాలు లీక్ అయ్యాయి.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్స్ ఆధారంగా వివో X200 FE స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ప్రారంభ ధర రూ.54999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999 గా ఉంటుందని తెలుస్తోంది.

వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,49,999 గా ఉంటుందని తెలుస్తోంది. వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్రే, వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. వివో X200 FE స్మార్ట్‌ఫోన్ లక్సీ గ్రే, అంబర్ యెల్లో, ప్రాస్ట్ర్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది.
వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ :
వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ (Vivo X Fold 5) 8.03 అంగుళాల అమోలెడ్ LTPO మెయిన్ డిస్‌ప్లే, 6.53 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫాంపై పనిచేస్తుందని తెలుస్తోంది. 80W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.
వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్, 50MP శాంసంగ్ JN1 అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డుయో 20MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

వివో X200 FE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Vivo X200 FE) 7.99mm థిక్‌నెస్‌తో సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇటీవలే విడుదల అయిన వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది.
వివో X200 FE స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యంతో కూడిన ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌తోపాటు 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








