Home
Mobile

వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ లీక్‌.. 6500mAh బ్యాటరీ, శక్తివంతమైన మీడియాటెక్‌ చిప్‌సెట్‌ సహా..!

Vivo X200 FE Smartphone : వివో X200 FE స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి రానుంది. కచ్చితమైన విడుదల తేదీని వివో ప్రకటించలేదు. మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్‌గా లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే కొన్ని దేశాల్లో ఈ ఫోన్ విడుదల అయింది. అయితే తాజాగా భారత్‌ లో ఈ వివో ఫోన్‌ విడుదల తేదీ లీక్‌ అయింది. టిప్‌స్టర్‌ పరాస్‌ గుగ్‌లానీ ఈ వివరాలను వెల్లడించారు.

ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? :
వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో జులై 14 వ తేదీన 12 PM గంటలకు విడుదల కానుందని టిప్‌స్టర్‌ తెలిపారు. ఈ ఫోన్ గ్లోబల్‌ వేరియంట్‌ తరహాలోనే ఈ ఇండియన్‌ మోడల్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ కంపాక్ట్‌ డిజైన్‌లో అందుబాటులోకి రానుంది.

Vivo X200 FE launch date leaked in india expected to feature 6500mAh Battery with compact design

కంపాక్ట్ డిజైన్‌ :
ఇటీవలే వన్‌ప్లస్‌ 13s ఫోన్‌ కంపాక్ట్ డిజైన్‌లో అందుబాటులోకి వచ్చింది. వివో X200 FE హ్యాండ్‌సెట్‌ 6.31 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ 7.99 mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

శక్తివంతమైన చిప్‌సెట్ :
ఈ వివో X200 FE స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. దీంతో ఫ్లాగ్‌షిప్ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ భారత వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంటుంది.

Take a Poll

6500mAh బ్యాటరీ :
బ్యాటరీ పరంగా ఏకంగా 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. వివో అందించిన వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి, 25.44 గంటల యూట్యూబ్‌ ప్లేబ్యాక్‌ లేదా 9.5 గంటల వరకు గేమింగ్ కు సపోర్టు చేస్తుంది.

మెరుగైన కెమెరాలు! :
కెమెరా విభాగానికి వివో అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌లోనూ Zeiss బ్రాండ్‌ భాగస్వామ్యంతో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

Vivo X200 FE launch date leaked in india expected to feature 6500mAh Battery with compact design

వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌ IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. భారత్‌ మార్కెట్‌లో ఈ వివో కంపాక్ట్‌ హ్యాండ్‌సెట్‌ లక్సీ బ్లాక్‌, అంబర్‌ యెల్లో, ప్రాస్ట్ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ రూ.40 వేల నుంచి రూ.50 వేల ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* ఇటీవలే వివో నుంచి T4 లైట్‌ 5G ఫోన్ విడుదల అయింది. ఇవాళ్టి నుంచి సేల్‌ ప్రారంభం అయింది. ప్రారంభ ధర రూ.9999 గా ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X200 FE launch date leaked in india expected to feature 6500mAh Battery with compact design
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X