6500mAh భారీ బ్యాటరీ, మూడు 50MP కెమెరాలు, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో Vivo స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వివో T4 సిరీస్‌తోపాటు వివో V50 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు విడుదల అయ్యాయి. అయితే ఎప్పటి నుంచో వివో X200 సిరీస్ నుంచి ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. వివో X200 FE పేరుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వివో మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్ అయ్యాయి.
ఏ పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది? :
చైనా మార్కెట్‌లో వివో X200 సిరీస్ నుంచి వివో X200, X200 ప్రో, X200 ప్రో మినీ మోడల్స్ లాంచ్ అయ్యాయి. భారత్ మార్కెట్‌లో ప్రో మిని మోడల్.. X200 FE గా (Vivo X200 FE Smartphone) అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే భారత్ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుంది? :
ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతోపాటు మరిన్ని నివేదికల ఆధారంగా వివో X200 FE స్మార్ట్‌ఫోన్ జులై నెలలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ యెల్లో, గ్రే కలర్ వేరియంట్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. వివో X200 FE స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.31 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు డిజైన్ పరంగా ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
వివో స్మార్ట్‌ఫోన్ అండర్ ది హుడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
భారీ బ్యాటరీ :
భారత్ మార్కెట్‌లో వివో X200 FE స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర సుమారుగా రూ.50,000 గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
మూడు 50MP కెమెరాలు :
వివో హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 3X ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








