50MP+ 50MP + 50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో vivo స్మార్ట్‌ఫోన్ విడుదల..!
Vivo X200 FE Smartphone Launched : భారత్ మార్కెట్‌లో ఇవాళ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వివో X200 FE, వివో X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. వివో X200 FE స్మార్ట్‌ఫోన్ కంపాక్ట్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు శక్తివంతమైన చిప్‌సెట్, భారీ బ్యాటరీ, ఆకట్టుకొనే కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చింది.
వివో X200 FE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ ఫోన్ 6.31 అంగుళాల 1.5K (1216 x 2640 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్, 460 ppi పిక్సల్ డెన్సిటీను కలిగి ఉంది. ఈ ఫోన్ HDR10+ సపోర్టు చేస్తుంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది.
మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యంతో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 8MP అల్టావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్టుతో 50MP టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను ముందువైపు అమర్చారు.
6500mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు AI ఫీచర్లను కలిగి ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ అంబర్ యెల్లో, ఫ్రాస్ట్ బ్లూ, లక్సీ గ్రే వంటి కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్, 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C, OTG వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 186 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

వివో X200 FE స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో X200 FE స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. భారత్ మార్కెట్‌లో జులై 23 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.
వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్ (Pre Order) చేసుకొనేందుకు అవకాశం ఉంది. HDFC, SBI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.6000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్ఛేంజీ బోనస్, నో కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








