ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వివో స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచే.. అదిరిపోయే ఫీచర్లు సహా..!!
వివో నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌లో కంపాక్ట్ మోడల్ వివో X200 FE విడుదల అయింది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి (Vivo X200 FE Smartphone Sale) ప్రారంభం కానుంది. Zeiss భాగస్వామ్యంతో కూడిన మెరుగైన కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 6500mAh బ్యాటరీతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది. భారత్‌లో రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
వివో X200 FE స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో X200 FE స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.59,999 గా ఉంది. ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అవుతుంది. వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వివో X200 FE స్మార్ట్‌ఫోన్ కాంపాక్ట్ డిజైన్‌లో అందుబాటులోకి వచ్చింది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.31 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 460 ppi పిక్సల్ డెన్సిటీను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ HDR10+ సపోర్టు చేస్తుంది.
వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది.

ఈ ఫోన్ గూగుల్ జెమిని, సర్కిల్ టూ సెర్చ్, AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, స్మార్ట్ కాల్ అసిస్టెంట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ ఫోన్ Zeiss భాగస్వామ్యంతో కూడిన కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 120 డిగ్రీల FOV తో 8MP అల్టావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. వీటితోపాటు 3x ఆప్టికల్ జూమ్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రైమరీ కెమెరా కూడా OIS సపోర్టును కలిగి ఉంటుంది. వివో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంటుంది. మొత్తంగా కెమెరా విభాగం పరంగా మెరుగైన పనితీరును అందిస్తుందని వివో చెబుతోంది.
ఈ వివో స్మార్ట్‌ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 186 గ్రాముల బరువును కలిగి ఉంది. అంబర్ యెల్లో, ఫ్రాస్ట్ బ్లూ, లక్సీ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా వివో స్మార్ట్‌ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.4, WiFi, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కో్ప్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, ఫ్లిక్కర్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








