Home
Mobile

6500mAh భారీ బ్యాటరీ. మూడు 50MP కెమెరాలు, శక్తివంతమైన చిప్‌సెట్‌ తో Vivo ఫోన్‌.. ఎప్పుడు విడుదల కానుందంటే..!

Vivo X200 FE : వివో నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ కానుంది. ఈ సంవత్సరం వివో V50, V50e, వివో T4x, T4 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. త్వరలో ఫ్లాగ్‌పిష్‌ మోడల్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. వివో X200 FE పేరుతో అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ ఫోన్‌ గురించి ఇప్పటికే అనేక లీక్స్‌ వచ్చాయి. ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతోపాటు మెరుగైన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల, ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌ అంచనా వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.31 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 200 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Vivo X200 FE Smartphone tipped

శక్తివంతమైన చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300+ లేదా మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కూడా సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది.

రెండు స్టోరేజీ వేరియంట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుందని తెలుస్తోంది. మరియు 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా Zeiss బ్రాండ్‌ తో కూడిన ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 50MP సోనీ IMX882 3X టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంటుందని సమాచారం.

6500mAh బ్యాటరీ :
ఈ వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని సమాచారం. ఈ ఫోన్‌ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ వైఫై 6 ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

Take a Poll

ఎప్పుడు విడుదల కానుందంటే :
ప్రముఖ టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్, Snartprix వివరాల ఆధారంగా వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం జులై నెలలో భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు కూడా లీక్‌ అయ్యాయి.

అయితే వివో X200 FE హ్యాండ్‌సెట్‌పై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. జులైలో విడుదల కానుందని భావిస్తున్న నేపథ్యంలో త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అనేక ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL mother's day offer 5 percent discount and validity extension on prepaid recharge plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X