50MP+50MP కెమెరాలు, 90W ఫాస్ట్ ఛార్జింగ్, కొత్త డైమెన్సిటీ 9400e చిప్‌తో భారత్ లో లాంచ్ కానున్న Vivo X200 FE..
Vivo X200 FE India launch : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో (Vivo) కంపెనీ త్వరలో భారతదేశంలోకి ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో X200 FEని తీసుకురాబోతోంది. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 9400e చిప్‌సెట్, 6.31-అంగుళాల OLED డిస్‌ప్లే ఉండొచ్చు. ఇంతకుముందు ఇండియాలో వస్తుందనుకున్న వివో X200 Pro మినీ స్థానంలో ఈ కొత్త X200 FE మోడల్ రానుండటం విశేషం. ఈ వార్త వివో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
* ఇండియాలో వివో X200 Pro Mini బదులు X200 FE
నిజానికి, Vivo X200 Pro Mini చైనాలో అక్టోబర్ 2024లో లాంచ్ అయిన తర్వాత, అదే ఫోన్ ఇండియాకు వస్తుందని చాలామంది ఊహించారు. కానీ, ఇప్పుడు వచ్చిన నివేదికల ప్రకారం వివో తన ప్లాన్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. X200 Pro Miniకి బదులుగా, ఇండియా మార్కెట్ కోసం ప్రత్యేకంగా వివో X200 FEని తీసుకురానుంది.

ఇది X200 Pro Miniకి కొన్ని మార్పులు చేసిన వెర్షన్ లేదా రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. Vivo X200 FE బహుశా 2025, జూన్ చివరిలో లేదా జులై 2025 మొదట్లో లాంచ్ అవ్వొచ్చని అంచనా. అయితే, కంపెనీ అంతర్గత నిర్ణయాలను బట్టి ఈ తేదీలు మారవచ్చు.
* వివో X200 FE ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా)
వివో X200 FEలో 6.31-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. ఇది 1.5K రిజల్యూషన్, స్మూత్ అనుభూతినిచ్చే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వివో X200 Pro మినీలో మూడు కెమెరాలు ఉండగా, X200 FE లో వెనుకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంటుందని అంచనా.
ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 50MP టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. ముందు వైపు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఇవ్వొచ్చు, ఇది సూపర్ క్లారిటీతో ఫోటోలను అందిస్తుంది. ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ కొత్త డైమెన్సిటీ 9400e చిప్‌సెట్.
ఈ చిప్ గురించి అధికారిక వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ, ఇది డైమెన్సిటీ 9400 కు కొన్ని మార్పులు చేసిన లేదా కొంచెం తక్కువ శక్తివంతమైన వెర్షన్ లేదా డైమెన్సిటీ 9300+కు మెరుగైన వెర్షన్ కావచ్చని భావిస్తున్నారు. అయితే వివో X200 Pro మినీలో స్టాండర్డ్ Dimensity 9400 చిప్ ఉంది.
* వివో S30 Pro Miniకి రీబ్రాండెడ్ వెర్షనా..?
వివో X200 FE 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా. అయితే, బ్యాటరీ సైజ్ ఎంత ఉంటుందనే విషయం ప్రస్తుతానికి తెలియదు. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, వివో X200 FE అనేది చైనాలో రాబోయే వివో S30 Pro మినీకి రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ రెండు ఫోన్లలో ఒకే రకమైన హార్డ్‌వేర్, ముఖ్యంగా Dimensity 9400e ప్రాసెసర్ ఉండవచ్చని అంచనా. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Digital Chat Station) ఇటీవల Vivo S30 Pro మినీ కీలక స్పెసిఫికేషన్లను లీక్ చేయడంతో, ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని బలంగా వినిపిస్తోంది.
ఆసక్తికరంగా, ఇదే Dimensity 9400e చిప్ త్వరలో రాబోయే OnePlus Ace 5 రేసింగ్ ఎడిషన్, ఒక కొత్త రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉపయోగించనున్నారని సమాచారం. దీన్నిబట్టి చూస్తే, ఈ ప్రాసెసర్ కేవలం వివోకే పరిమితం కాకుండా ఇతర ప్రధాన బ్రాండ్‌ల దృష్టినీ ఆకర్షించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇదే చిప్‌సెట్‌తో మార్కెట్లో పోటీ ఉండే అవకాశముంది.
* వివో X200 FE ధర ఎంత ఉండొచ్చు..
చైనాలో, వివో X200 Pro Mini (12GB RAM + 256GB స్టోరేజ్) ప్రారంభ ధర CNY 4,699 (మన కరెన్సీలో సుమారు రూ.56,000). Vivo X200 FE స్పెసిఫికేషన్లలో చిన్న తేడాలు ఉండొచ్చు కాబట్టి, వివో దీనిని భారతదేశంలో మరింత పోటీ ధరతో, బహుశా కొంచెం తక్కువ ధరకే తీసుకురావచ్చని భావిస్తున్నారు.
ఒక అంచనా కోసం చూస్తే, గత డిసెంబర్‌లో భారతదేశంలో విడుదలైన వివో X200 సిరీస్ ప్రారంభ ధర రూ.65,999 గా ఉంది. కాబట్టి, X200 FE ధర ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications








