200MP కెమెరా, 6000mAh బ్యాటరీతో Vivo స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
వివో ఇండియా నుంచి త్వరలో వివో X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు (Vivo X200 Series) విడుదల కానున్నాయి. అయితే కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. ఈ సిరీస్ లో భాగంగా X200 మరియు X200 ప్రో స్మార్ట్‌ఫోన్ లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే వివో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ల ద్వారా ఈ హ్యాండ్‌సెట్ ల వివరాలు టీజ్ చేస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ల అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్ ప్రో మోడల్ 200MP ZEISS కెమెరాను కలిగి ఉంటుంది.
6000mAh బ్యాటరీ :
అయితే భారత్ మార్కెట్‌లో వివో X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 SoC చిప్‌సెట్ మరియు V3+ ఇమేజింగ్ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. దీంతోపాటు 6000mAh సెమీ సోలిడ్ స్టేట్ బ్యాటరీతో పనిచేస్తుంది.

200MP ప్రైమరీ కెమెరా :
దీంతోపాటు ప్రో మోడల్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 200MP Zeiss APO టెలిఫొటో కెమెరాను కలిగి ఉంటుంది. భారత్‌లో ఈ రెండు వేరియంట్‌లు అమెజాన్ మరియు వివో అధికారిక వెబ్‌సైట్ లో కొనుగోలు చేయవచ్చు.
వివో X200 ప్రో మోడల్ భారత్ మార్కెట్‌లో సుమారు ధర రూ.90,000 గా ఉంది. అదే బేస్ వేరియంట్ ధర సుమారుగా రూ.70,000 గా ఉంది. వివో గత మోడల్ వివో X100 ప్రారంభ ధర రూ.89,999 గా ఉండేది. అదే X100 బేస్ వేరియంట్ రూ.63,999 కి అందుబాటులోకి వచ్చింది.
మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ :
ఇప్పటికే వివో X200 మరియు X200 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు గత నెలలోనే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు మోడళ్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. 16GB LPDDR5x ర్యామ్ మరియు 512GB UFS 4.0 తో జతచేసి ఉంటుంది. మరియు ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది.
ట్రిపుల్ కెమెరా :
చైనాలో వివో X200 ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో సోనీ LYT 818 కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 200MP పెరిస్కోప్ కెమెరాలను కలిగి ఉంది. అదే బేస్ వేరియంట్ 50MP పెరిస్కోప్ లెన్స్ సహా ఇతర కెమెరాలను కలిగి ఉంది. 120fps వద్ద 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుంది.
90W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ :
చైనా వేరియంట్ వివో X200 స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్రో 90W వైర్ ఛార్జింగ్ మరియు 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు 6.67 అంగుళాల 6.67 అంగుళాల క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








