50MP + 200MP + 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీతో Vivo స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఫీచర్‌లు, ధర వివరాలు..!
వివో నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇవాళ వివో X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు (Vivo X200 Series) లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా X200 మరియు X200 ప్రో హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తాయి. మరియు మీడియాటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ZEISS సపోర్టుతో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉన్నాయి. వివో X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
వివో X200 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Vivo X200 Smartphone) Zeiss నేచురల్ కలర్ సపోర్టుతో 6.67 అంగుళాల క్వాడ్ కర్వడ్ 1,5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2169Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5.0 ను కలిగి ఉంది. 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని వివో చెబుతోంది. 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్ మరియు గరిష్ఠంగా 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.
బేస్ వేరియంట్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh BlueVolt బ్యాటరీతో పనిచేస్తుంది. థర్డ్ జనరేషన్ సిలికాన్ యానోడ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాలను Zeiss భాగస్వామ్యంతో రూపొందించారు. f/1.57 అపేచర్, అడ్వాన్స్‌డ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP LYT-818 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది.
దీంతోపాటు 100x Zeiss అల్ట్రా HD జూమ్‌తో 50MP IMX882 పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంది. ఈ కెమెరాతో 10 బిట్ కలర్‌తో 120fps వద్ద 4K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ V2 ఇమేజింగ్ చిప్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
వివో X200 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ప్రో మోడల్ (Vivo X200 Pro Smartphone) కూడా Zeiss నేచురల్ కలర్‌తో కూడిన 6.78 అంగుళాల క్వాడ్ కర్వడ్ 1.5 LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 0.5- 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 OS ను కలిగి ఉంది. వివో థర్డ్ జనరేషన్ సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో కూడిన 30W వైర్‌లెస్, 90W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్ కూడా వెనుకవైపు Zeiss భాగస్వామ్యంతో కూడిన ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. f/1.57 అపేచర్, CIPA 4.5 స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ LYT-818 ప్రైమరీ కెమెరా, f/2.67 అపేచర్, CIPA 4.5 స్టెబిలైజేషన్‌తో 200MP శాంసంగ్ HP9 Zeiss APO సూపర్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.
ఈ ప్రో మోడల్ f/2.0 అపేచర్‌తో 50MP అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. V3+ ఇమేజింగ్ చిప్, Zeiss T లెన్స్ కోటింగ్‌ను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా HDR సినిమాటిక్ పోర్ట్రెయిట్, 120fps వద్ద 10 బిట్‌తో 4K రికార్డింగ్ చేయవచ్చు. అదే విధంగా 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
వివో X200 సిరీస్ ధర, సేల్ వివరాలు :
వివో X200 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.65,999 గా ఉంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.71,999 గా ఉంది. అదే ప్రో మోడల్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది.
ఈ సిరీస్ సేల్ డిసెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచే వివో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రీ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా SBI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసి గరిష్ఠంగా రూ.9,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వివో X200 ఫోన్ నేచురల్ గ్రీన్ మరియు కాస్మోస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అదే ప్రో మోడల్ టైటానియం గ్రే మరియు కాస్మోస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications