Home
Mobile

సూపర్‌ కెమెరాలు కలిగిన ప్రీమియం ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. రూ.9500 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయండి..!

వివో నుంచి భారత్‌ మార్కెట్‌లో వివో X200 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా వివో X200 మరియు X200 ప్రో హ్యాండ్‌సెట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ్టి నుంచి ఈ రెండు ఫోన్‌ల సేల్‌ (Vivo X200 Series Smartphones Sale) ప్రారంభం అయింది. వివో ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సిరీస్‌ ఫోన్‌లు మెరుగైన కెమెరాలను కలిగి ఉన్నాయి.

వివో X200 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.65,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.71,999 గా ఉంది. అయితే ప్రో మోడల్‌ కేవలం ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది.

Vivo X200 Series smartphones sale

వివో X200 సిరీస్‌ ను SBI, ICICI, HDFC బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపైనా డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పైన తెలిపిన కార్డులతో కొనుగోలు చేస్తే వివో X200 ఫోన్‌ 12GB ర్యామ్‌ వేరియంట్‌పైన గరిష్ఠంగా రూ.6600 డిస్కౌంట్‌, 16GB ర్యామ్‌ వేరియంట్‌పైన రూ.7200 డిస్కౌంట్‌, అదే ప్రో మోడల్‌ పై రూ.9500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. X200 మోడల్‌ నేచురల్‌ గ్రీన్, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. అదే ప్రో వేరియంట్ టైటానియం గ్రే, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

Vivo X200 Series smartphones sale

వివో X200 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు :
వివో X200 స్మార్ట్‌ఫోన్‌ (Vivo X200 Smartphones) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ 1,5k OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌, 2169Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ వివో ఫోన్‌ 3nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 16GB LPDDR5X ర్యామ్‌ మరియు గరిష్ఠంగా 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్లో అందుబాటులో ఉంది.

Vivo X200 Series smartphones sale

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OriginOS 5.0 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

కెమెరా విభాగానికి ఈ సిరీస్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. Zeiss భాగస్వామ్యంతో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.57 అపేచర్‌తో 50MP LYT 818 ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్‌, 100X Zeiss అల్ట్రా HD జూమ్‌తో 50MP IMX882 పెరిస్కోప్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వివో X200 ప్రో (Vivo X200 Pro Smartphones) మోడల్ 0.5- 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ 1.5 LTPO OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్ కలిగి ఉంది. 30W వైర్‌లెస్‌, 90W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OriginOS 5.0 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16GB LPDDR5X ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. 3D అల్ట్రాసోనిక్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చి ఉంది.

వివో X200 ప్రో మోడల్ వెనుక వైపు Zeiss భాగస్వామ్యంతో ట్రిపుల్‌ కెమెరాలను అమర్చి ఉన్నాయి. CIPA 4.5 స్టెబిలైజేషన్‌, f/1.57 అపేచర్‌తో 50MP సోనీ LYT 818 కెమెరా, CIPA 4.5 స్టెబిలైజేషన్‌, f/2.67 అపేచర్‌తో 200MP శాంసంగ్ HP9 Zeiss APO సూపర్‌ టెలిఫోటో కెమెరా, ను కలిగి ఉంది. 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చారు. 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X200 Series smartphones sale is live in india check features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X