6GB RAM, 200MP కెమెరా, 6.82 అంగుళాల డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వివో X200 అల్ట్రా వచ్చేసింది..ధర ఎంతంటే
Vivo X200 Ultra : వివో కంపెనీ చైనాలో జరిగిన ఒక ఈవెంట్‌లో తమ అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ "X200 అల్ట్రా"ను అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ, అద్భుతమైన డిస్‌ప్లే, అదిరిపోయే వేగం లక్ష్యంగా దీన్ని రూపొందించారు. వివో ఫోన్లలో మునుపెన్నడూ చూడని అత్యంత ఆధునిక హార్డ్‌వేర్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచారు.
కళ్లు చెదిరే 2K అమోలెడ్ డిస్‌ప్లే నుంచి, సరికొత్త 200MP టెలిఫోటో లెన్స్ వరకు, X200 అల్ట్రా మొబైల్ ఫోటోగ్రఫీకి కొత్త అర్థం చెప్పనుంది. దీనికి తోడు IP69 రేటింగ్స్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, రెండు కస్టమ్ ఇమేజింగ్ చిప్‌లతో, అత్యుత్తమ ఫోన్ కావాలనుకునే వారి కోసం ఇది సిద్ధమైంది.

* అద్భుతమైన డిస్‌ప్లే, అదిరిపోయే వేగం..
X200 అల్ట్రాలో 6.82 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 2K రిజల్యూషన్ (3168 x 1440 పిక్సెల్స్), HDR10+ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, 1Hz నుంచి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా పనిచేస్తుంది. కళ్లకు హాని కలగకుండా 2160Hz PWM డిమ్మింగ్, గీతలు పడకుండా ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు.
ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి జతగా 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. దీనివల్ల గేమింగ్, మల్టీ-టాస్కింగ్, కంటెంట్ క్రియేషన్ చేసినా వేగం విషయంలో తిరుగుండదు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఒరిజిన్ OS 5 స్కిన్‌తో వస్తుంది.
* కెమెరాలు
ఫోటోగ్రఫీ విషయంలోనే X200 అల్ట్రా అసలు సత్తా చూపిస్తుంది. దీని వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. ఒకటి 50MP ప్రైమరీ సెన్సార్, రెండోది 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, అసలు హైలైట్ - 200MP జైస్ (Zeiss) APO టెలిఫోటో కెమెరా. దీనికి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), f/2.5 అపెర్చర్, 85mm ఫోకల్ లెంగ్త్ ఉన్నాయి.
ఇది ఫోటోగ్రఫీలో ఒక సంచలనం. ఈ కెమెరాలన్నీ సోనీ, శాంసంగ్ తయారుచేసిన లేటెస్ట్ సెన్సార్లతో పనిచేస్తాయి. అంతేకాదు, వివో మొట్టమొదటిసారిగా రెండు ఇమేజింగ్ చిప్‌లను వాడింది. ఫోటో తీయడానికి ముందు ప్రాసెసింగ్ కోసం VS1 చిప్, తీసిన తర్వాత ఫోటోను మరింత అందంగా మార్చడానికి V3+ చిప్.
ఈ రెండూ కలిసి 4K వీడియోను 60fps వద్ద, 4K స్లో-మోషన్ వీడియోను 120fps వద్ద, చివరికి 4K టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీని కూడా సాధ్యం చేస్తాయి. దీనివల్ల వీడియోలు తీయాలనుకునే వారికి ఈ ప్రీమియం మొబైల్ ఒక వరం లాగా నిలుస్తుంది.
* కెమెరా కంట్రోల్ మీ చేతుల్లో..
ఫోన్ పక్కన ఒక ప్రత్యేకమైన "V" బటన్ ఇచ్చారు. దీన్ని ఉపయోగించి యూజర్లు కెమెరాను పూర్తిగా మాన్యువల్‌గా కంట్రోల్ చేయవచ్చు. జూమ్ చేయడం, ఎక్స్‌పోజర్ మార్చడం, కెమెరాను వెంటనే ఆన్ చేయడం, ఫోకస్ లాక్ చేయడం వంటివి సులభంగా చేయొచ్చు. దీనితో పాటు, వివో ఓ 2.35x జైస్ టెలిఫోటో లెన్స్ కన్వర్టర్‌ను పరిచయం చేసింది.
దీన్ని వాడితే టెలిఫోటో సామర్థ్యం ఏకంగా 200mm వరకు పెరుగుతుంది. ఈ లెన్స్ ఒక "ఫోటోగ్రఫీ కిట్"లో భాగంగా వస్తుంది. ఈ కిట్‌లో USB-C గ్రిప్, 2300mAh అదనపు బ్యాటరీ, 67mm ఫిల్టర్ అడాప్టర్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి X200 అల్ట్రాను కంటెంట్ క్రియేటర్లకు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టూల్‌గా మారుస్తాయి.
* ప్రీమియం లుక్, భద్రత, కనెక్టివిటీ అన్నీ టాప్..
X200 అల్ట్రాకు IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. ఇది దుమ్ము, నీళ్లు మాత్రమే కాదు, ఎక్కువ ప్రెషర్‌తో నీళ్లు చల్లినా తట్టుకుంటుంది. ఫోన్‌లో అల్ట్రాసోనిక్ 3D ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టీవీ/ఏసీ లాంటివి ఆపరేట్ చేయడానికి ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, హై-ఫై స్టీరియో స్పీకర్లు, USB-C ఆడియో పోర్ట్, పూర్తి 5G సపోర్ట్ ఉన్నాయి.
వీటితో పాటు లేటెస్ట్ Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, మరియు నావిక్ (NavIC), గెలీలియో (Galileo), క్యూజెడ్‌ఎస్‌ఎస్ (QZSS) వంటి అధునాతన GPS సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొబైల్ కనెక్టివిటీ అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు.
* భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..
ఈ ఫోన్‌లో ఏకంగా 6000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇంత భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌తో, రోజంతా ఎంత ఎక్కువగా వాడినా ఛార్జింగ్ అయిపోదు, అయిపోయినా క్షణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు.
* ధరలు, వేరియంట్లు ఇవే..
వివో X200 అల్ట్రా మూడు రంగుల్లో లభిస్తుంది. అవి బ్లాక్, రెడ్, రిమోవా సూట్‌కేస్‌ల స్ఫూర్తితో రూపొందించిన ప్రత్యేకమైన వైట్ ఎడిషన్. చైనాలో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 6,499 యువాన్లు (సుమారు రూ.75,000) 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 యువాన్లు (సుమారు రూ.81,000).
16GB RAM + 1TB స్టోరేజ్ (శాటిలైట్ ఎడిషన్) 7,999 యువాన్లు (సుమారు రూ.92,500). 1TB మోడల్‌తో కలిపి ఫోటోగ్రఫీ కిట్ బండిల్ ధర CNY 9,699 (సుమారు రూ.1,12,000). జైస్ టెలిఫోటో కన్వర్టర్ (CNY 1,299), ప్రొఫెషనల్ ఇమేజింగ్ కిట్ (CNY 699) వంటివి విడిగా మే నెల నుంచి అందుబాటులోకి వస్తాయి. ఫోన్ అమ్మకాలు చైనాలో ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications








