6200mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్, 50MP కెమెరాతో vivo X200s లాంచ్..!
Vivo X200s launch : టెక్నాలజీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివో (Vivo) X200s స్మార్ట్‌ఫోన్ చైనాలో అధికారికంగా విడుదలైంది. ఇది వివో కంపెనీకి చెందిన ప్రీమియం X200 సిరీస్‌లో ఒక పవర్‌ఫుల్ మోడల్. సరికొత్త టెక్నాలజీ, అదిరిపోయే డిస్‌ప్లే, స్టైలిష్ డిజైన్, సూపర్ డ్యూరబిలిటీ.. ఇలా అన్ని కలగలిపి 2025లో రాబోయే అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటిగా నిలవడానికి సిద్ధమైంది.
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, శక్తివంతమైన డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, ఏకంగా 6200mAh భారీ బ్యాటరీ, దుమ్ము, నీటి నుంచి అత్యుత్తమ రక్షణ కోసం IP69 రేటింగ్స్ వంటివి ఉన్నాయి. దీంతో ఫ్లాగ్‌షిప్ మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి వివో X200s పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.

* డైమెన్సిటీ 9400+తో దూసుకుపోండి..
వివో X200s 3nm టెక్నాలజీతో తయారైన మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ (MediaTek Dimensity 9400+) ప్రాసెసర్ తో వస్తుంది. గ్రాఫిక్స్ విషయానికి వస్తే, ఇమ్మోర్టాలిస్-G925 (Immortalis-G925) GPU ఉంది. దీనివల్ల గేమింగ్ అయినా, మల్టీ టాస్కింగ్ అయినా ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
ఈ ఫోన్ గరిష్టంగా 16GB LPDDR5X RAM, 1TB UFS 4.1 స్టోరేజ్‌తో లభిస్తుంది. అంటే వేగం, ఫైల్స్ సేవ్ చేసుకునే స్థలం విషయంలో ఎలాంటి లోటూ ఉండదు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఒరిజిన్ OS 15 (Origin OS 15)తో వస్తుంది. వాడటానికి సులభంగా, మనకు నచ్చినట్లు మార్చుకునేలా ఉంటుంది.
* అద్భుతమైన డిస్‌ప్లే, అదిరే డ్యూరబిలిటీ
వివో X200sలో BOE సంస్థ తయారుచేసిన 6.67 అంగుళాల అమోలెడ్ LTPS స్క్రీన్ ఉంది. దీని రిజల్యూషన్ 1.5K (2800×1260 పిక్సెల్స్) చాలా స్పష్టంగా ఉంటుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. కళ్లకు ఇబ్బంది కలగకుండా 2160Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వాడారు.
దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 5000 నిట్స్ వరకు ఉంటుంది. ఫోన్ చూడటానికి ప్రీమియంగా గ్లాస్, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో ఉన్నా, కేవలం 7.99mm మందంతో చాలా స్లిమ్‌గా, 203 గ్రాముల బరువుతో (నలుపు రంగు మోడల్ 205 గ్రాములు) తేలికగా ఉంటుంది. ముఖ్యంగా, దీనికి IP68, IP69 రేటింగ్స్ రెండూ ఉన్నాయి.
* ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోసం Zeiss ట్రిపుల్ 50MP కెమెరాలు
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, వివో X200s వెనుక భాగంలో Zeiss ఆప్టిక్స్‌తో కూడిన శక్తివంతమైన ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరాగా 50MP సోనీ IMX921 సెన్సార్ (f/1.57 అపెర్చర్, OIS సపోర్ట్‌తో) ఇవ్వగా, అల్ట్రా-వైడ్ కెమెరాగా 50MP Samsung JN1 సెన్సార్ ఇచ్చారు.
పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాగా 50MP సోనీ IMX882 సెన్సార్ (3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్, f/2.57 అపెర్చర్) అందించారు. ఈ ఫోన్‌లోని కొత్త ఇమేజ్ టెక్నాలజీ వల్ల 10x కంటే ఎక్కువ జూమ్ చేసినప్పుడు కూడా ఫోటోలు క్లియర్‌గా వస్తాయి. ముందు 32MP కెమెరా ఉంది. ఇది 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేయగలదు.
* రోజు మొత్తం వచ్చే బ్యాటరీ లైఫ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్‌లో ఒక పెద్ద హైలైట్. వివో X200sలో ఏకంగా 6200mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనివల్ల ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వస్తుంది. ఎక్కువగా ఫోన్ వాడేవారికి కూడా ఇది నిరాశపరచదు.
* సెక్యూరిటీ, కనెక్టివిటీలో రాజీ లేదు
భద్రత కోసం, ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్) ఉంది. అలాగే, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఇచ్చారు. ఇది డ్యూయల్ సిమ్, 5G SA/NSA, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, డ్యూయల్-యాంటెన్నా NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
నావిగేషన్ కోసం Beidou, GPS, GLONASS, GALILEO, QZSS (బీడౌ, GPS, గ్లోనాస్, గెలీలియో, QZSS) వంటి అన్ని ప్రధాన సిస్టమ్స్‌కి సపోర్ట్ ఉంది. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇవి యూజర్లకు చాలా బాగా ఉపయోగపడతాయి.
* ధర, లభ్యత వివరాలు
వివో X200s ఫోన్ సింపుల్ బ్లాక్ (Simple Black), లైట్ పర్పుల్ (Light Purple), మింట్ బ్లూ (Mint Blue), స్ట్రెయిట్‌ఫార్వర్డ్ వైట్ (Straightforward White) రంగులలో లభిస్తుంది. చైనాలో దీని ధరలు చూస్తే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 (సుమారు రూ.49,000) యువాన్లు ఉంది.
16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లు..12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,699 యువాన్లు.. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లు.. 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లు ఉంది. ప్రస్తుతం చైనాలో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఏప్రిల్ 25 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications








