Home
Mobile

50MP + 50MP + 50MP కెమెరాలు, 7 సంవత్సరాల అప్‌డేట్స్‌తో Vivo స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

Vivo X200T Smartphone : వివో X200T స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. వివో X200 సిరీస్‌ లో భాగంగా ఇప్పటికే X200, X200 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్‌ అయిన ఫోన్‌ కెమెరా విభాగం పరంగా ZEISS భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అమోలెడ్‌ డిస్‌ప్లే, టెలిఫోటో లెన్స్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ప్రీమియం సెగ్మెంట్‌ లో అందుబాటులోకి వచ్చింది.

వివో X200T స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 460 PPI పిక్సల్‌ డెన్సిటీని సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్టెల్లర్‌ బ్లాక్‌, సీసైడ్‌ లిలక్‌ రెండు కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంటుంది.

Vivo X200T Smartphone launched in india

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
వివో ఫోన్ 3nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 3x ఆప్టికల్‌ జూమ్‌ సపోర్టుతో 50MP టెలిఫోటో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

Vivo X200T Smartphone launched in india

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, IP68 + IP69 రేటింగ్‌ :
వివో X200T స్మార్ట్‌ఫోన్ 90W వైర్‌ ఛార్జింగ్, 45W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 7, NFC, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.

వివో X200T స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Vivo X200T Sale in india) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.69999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5000 వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

దీంతోపాటు గరిష్ఠంగా రూ.5000 వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌ ను పొందవచ్చు. 18 నెలల వరకు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), ఇతర ప్రముఖ రిటైల్‌ స్టోర్స్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X200T Smartphone with mediatek dimensity 9400 plus chip, 50MP telephoto lens launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X