ఆకట్టుకొనే డిజైన్, అదిరిపోయే స్పెసిఫికేషన్‌లతో వివో ఫోన్.. రేపే విడుదల..!
Vivo X200T Smartphone : వివో X200T స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో రేపు (జనవరి 27) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. వివో వెబ్‌సైట్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్, టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగానూ ఆకట్టుకొనే అవకాశం ఉంది.
చిప్‌సెట్ వివరాలు :
వివో X200T స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 460 PPI డెన్సిటీ, P3 కలర్ Gamut ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ZEISS భాగస్వామ్యంతో 50MP IMX921 OIS ప్రైమరీ, 50MP JN1 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 100x హైపర్‌జూమ్, 20x టెలిఫోటో మ్యాక్రో జూమ్‌తో 50MP IMX882 టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్టు :
ఈ ఫోన్ 90W ఫ్లాష్ ఛార్జ్, 40W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. గేమింగ్ సమయంలో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ సహాయపడుతుందని చెబుతోంది. మూడో తరం సిలికాన్ ఆనోడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ సీసైడ్ లిలక్, స్టెల్లర్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ రేపు విడుదల కానుంది. విడుదల సమయంలో స్టోరేజీ వేరియంట్స్, ధర, సేల్ వివరాలు వెల్లడి కానున్నాయి.
* వివో X300 సిరీస్ :
గత నెలలో భారత్ మార్కెట్‌లో వివో X300 సిరీస్ విడుదల అయింది. వివో X300 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.31 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తోంది. 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యంతో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. 50MP JN1 వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్టుతో 50MP సోనీ IMX885 LYT 602 కెమెరా ఉంది. 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6040mAh బ్యాటరీని కలిగి ఉంది.
వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తోంది. పనిచేస్తుంది. 5 ఆండ్రాయిడ్ OS, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 828 ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 200MP టెలిఫోటో లెన్స్, 50MP వైడ్ యాంగిల్ JN1 సెన్సర్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6510mAh బ్యాటరీతో పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








