50MP + 50MP + 50MP కెమెరాలు, 7 సంవత్సరాల అప్‌డేట్స్‌తో ఫోన్.. రూ.5000 డిస్కౌంట్!
Vivo X200T Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి X200T స్మార్ట్‌ఫోన్ ఇటీవలే విడుదల అయింది. X200 సిరీస్‌లో భాగంగా X200, X200 ప్రో మోడల్స్ ఇప్పటికే విడుదల అయ్యాయి. వివో X200T స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 OS తోపాటు మూడు 50MP కెమెరాలను కలిగి ఉంది.
వివో X200T స్మార్ట్‌ఫోన్ ను వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.69999 గా ఉంది.

డిస్కౌంట్ ఆఫర్‌తోపాటు రూ.5000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు 18 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ సీసైడ్ లిలక్, స్టెల్లర్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
డిస్‌ప్లే వివరాలు :
వివో X200T హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 460 PPI పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీను కలిగి ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్టుతో 50MP టెలిఫోటో కెమెరా ఉంది.
6200mAh బ్యాటరీ :
ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4.5K లిక్విడ్ కూలింగ్ వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఛార్జింగ్, 45W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications