సంచలనం రేపుతున్న Vivo X21, ఆ ఫీచరే హైలెట్

|

చైనా మొబైల్ దిగ్గజం వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్21ను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. భారీ డిస్‌ప్లే, డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతగా కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఫోన్ గడేడాది జరిగిన Mobile World Congress (MWC 2017) ఈవెంట్లో పరిచయం చేసింది. అప్పటి నుంచి ఈ ఫోన్ మీద యూజర్లకు ఎనలేని ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఇండియా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు ధర ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలిద్దాం.

 

డేటా ఫ్రీగా వచ్చిందని పోర్న్ తెగ చూస్తున్నారు,రిపోర్ట్ తెలిపిన నిజాలుడేటా ఫ్రీగా వచ్చిందని పోర్న్ తెగ చూస్తున్నారు,రిపోర్ట్ తెలిపిన నిజాలు

వివో ఎక్స్21 ఫీచర్లు

వివో ఎక్స్21 ఫీచర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర

ధర

రూ.35,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి ప్రత్యేకంగా లభిస్తున్నది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే ఈ ఫోన్‌ను విడుదల చేశారు. Vivo X21 స్మార్ట్‌ఫోన్‌ అచ్చం ఆపిల్ ఐఫోన్ X ను పోలిన విధంగా ఉండే డిజైన్‌తో వచ్చింది.

6.28 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే..
 

6.28 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే..

వివో ఎక్స్21 స్మార్ట్‌ఫోన్‌లో 6.28 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే డిస్‌ప్లే కింది వైపు లోపలి భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్..

ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్..

దీని వల్ల డిస్‌ప్లే పైనే యూజర్లు చేతి వేలితో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో డివైస్ అన్‌లాక్ అవుతుంది. దీన్ని ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అని వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌

ఈ ఫోన్‌లో 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల డివైస్ వేగంగా పనిచేస్తుంది.

రెండు కెమెరాలను

రెండు కెమెరాలను

ఈ ఫోన్ వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. అలాగే ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీని కలిగి ఉంటాయి.

Best Mobiles in India

English summary
Vivo X21 brings out conceptual design into reality with its in-display fingerprint reader More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X