సెల్ఫీ కెమెరా విభాగంలో దుమ్మురేపుతున్న Vivo X21

|

చైనా దిగ్గజం ఈ మధ్య లేటెస్ట్ గా లాంచ్ చేసిన వివో మార్కెట్లో దూసుకుపోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్యూచరిస్టిక్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో వచ్చిన Vivo X21 అమ్మకాల్లో సరికొత్త సునామిని తలపిస్తోంది. ఈ ఏడాది రానున్న స్మార్ట్‌ఫోన్లకు Vivo X21 ఓ రోడ్ మ్యాప్ లా సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుందని కంపెనీతో విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫోన్ ఒక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మాత్రమే కాకుండా మొత్తంగా మల్టీమీడియా టెక్నాలజీతో దూసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. భారీ Full HD+ AMOLED screenతో పాటు మెటల్ డిజైన్ బెస్ట్ క్లాస్ కెమెరాలతో Vivo X21 మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. పూర్తి ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

 

సంచలనం రేపుతున్న Vivo X21, ఆ ఫీచరే హైలెట్సంచలనం రేపుతున్న Vivo X21, ఆ ఫీచరే హైలెట్

డ్యూయెల్ లెన్స్ కెమెరా సెట్‌అప్

డ్యూయెల్ లెన్స్ కెమెరా సెట్‌అప్

Vivo X21 12MP+ 5MP డ్యూయెల్ రేర్ సెల్ఫీ కెమెరా సెట్‌అప్ తో వచ్చింది. ఇది Dual Pixel సెన్సార్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. అత్యంత తక్కువ వెలుతురులో కూడా నాన్యమైన ఫోటోలను తీసుకునే విధంగా ఈ ఫోన్ కెమెరాను తీర్చిదిద్దారు. ఫోటోను అత్యంత ప్రకాశవంతంగా మీకు కనిపించేదానికి ఈ ఫోన్ కెమెరాలో అధునాతన టెక్నాలజీని వాడారు. స్పీడ్ ఫోకస్, అలాగే క్యాప్చర్, ఫిక్చర్ క్వాలిటీ అందంగా వచ్చేలా కొన్ని రకమైన మార్పులను ఈ కెమెరాలో ఫోటో తీసుకునే సమయంలో ఆటోమేటిగ్గా గమనించవచ్చు.

శాంపిల్ ఫోటో

శాంపిల్ ఫోటో

మీరు చూస్తున్న ఈ ఫోటో అత్యంత తక్కువ వెలుతురులో Gizbot టీమ్ షూట్ చేసింది. టెస్ట్ కోసం తీసిన ఈ షూట్ లో సెల్ఫీ కెమెరా పనితీరు చాలా ఆశ్చర్యపరిచింది కూడా. అత్యంత తక్కువ వెలుతురులో ఇంత ప్రకాశవంతంగా ఫోటో రావడమనేది చాలా అరుదైన విషయమే. మీరు ఫోటో క్యాప్చర్ చేసే సమయంలో వెలుతురుకి సంబంధించిన అడ్జెస్టెమెంట్లు ఫోటోకి అనుగుణంగా మార్చుకునే సౌలభ్యం ఉంది. మీరు సాధారణ వెలుతురులో ఎలా ఫోటోను తీస్తారు అచ్చం అలాగే లో లైట్ లో కూడా తీసుకోవచ్చు.

AI powered HDR mode
 

AI powered HDR mode

Vivo X21 లో రెండు కెమెరాలు AI backed HDR modeతో వచ్చాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రతి ఫేమ్ చాలా స్పష్టంగా కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా dark or backlight ఉన్న పరిస్థితుల్లో కూడా ఫోటో అత్యంత క్వాలిటీతో షూట్ చేసుకోవచ్చు.

Daylight shots

Daylight shots

మీరు చూస్తున్న ఫోటో వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు తీసిన చిత్రం. ఇమేజ్ అవుట్ పుట్ సాధారణ సమయంలో తీసిన ఫోటో కన్నా అత్యంత క్వాలిటీగా వచ్చింది. మీరు చిత్రాన్ని 100 శాతం జూమ్ చేసి తీసినప్పటికీ అది నార్మల్ ఫోటోలాగానే కనిపిస్తుంది. రంగుల్లో కాని ఫోటో ఫిక్సల్ లో కాని మీకు ఎటువంటి అంతరాయం లేకుండా కరెక్ట్ గా వస్తుంది. అమోల్డ్ స్క్రీన్ ద్వారా ఫోటోలు చాలా అందంగా కనిపిస్తాయి. 5 ఎంపీ కెమెరాతో తీసిన ఫోటోలు కూడా అంతే నాణ్యంగా కనిపిస్తాయి.

AI face Beauty

AI face Beauty

వివో కంపెనీ గత కొద్ది సంవత్సరాల నుంచి సెల్ఫీ స్మార్ట్ ఫోన్ల మీద ప్రధాన దృష్టిని నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చిన Vivo X21 వీటిన్నింటికంటే చాలా భిన్నంగా వచ్చింది. ముందు భాగంలో ప్రవేశపెట్టిన కెమెరాలు Dual-Pixel technology, new AI Face Beauty modeతో రావడం వల్ల సెల్ఫీ ఫోటోలు అసలు కెమెరాలో తీసినంత అందంగా కనిపిస్తాయి. ఫోటోలో చర్మం కాని అలాగే గడ్డం, కన్నులు, స్కిన్ టోన్ వంటి ముఖ భాగాలను స్పష్టంగా వచ్చేలా షూట్ చేయవచ్చు. క్లాసిక్ బ్యూటీ కెమెరా ఫీచర్ ద్వారా ఇవి సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ ఈ ఫోన్లో ఉంది.

AR stickers

AR stickers

ఈ కెమెరాలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే AR stickers.ఈ స్టిక్కర్స్ ద్వారా మీరు మీకు నచ్చిన విధంగా ఫన్నీ ఫోటోలను తీసుకోవచ్చు. Snapchat, Instagramలో ఉండే అన్ని రకాల స్టిక్కర్లు ఈఫోన్లో పొందుపరిచారు. ఇంకో ఫీచర్ ఏంటంటే Palm Capture. ఈ ఫీచర్ ద్వారా మీరు క్లిక్ బటన్ అందుకోలేనప్పుడు దీని ద్వారా ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. చివరగా తక్కువ కానిది ఏంటంటే Selfie Lighting ఫీచర్. దీని ద్వారా మీరు ప్రొపెషనల్ స్థాయిలో కవర్ షాట్లను తీసుకోవచ్చు.

వివో ఎక్స్21 ఫీచర్లు

వివో ఎక్స్21 ఫీచర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర

ధర

రూ.35,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి ప్రత్యేకంగా లభిస్తున్నది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే ఈ ఫోన్‌ను విడుదల చేశారు. Vivo X21 స్మార్ట్‌ఫోన్‌ అచ్చం ఆపిల్ ఐఫోన్ X ను పోలిన విధంగా ఉండే డిజైన్‌తో వచ్చింది.

Best Mobiles in India

English summary
Vivo X21: Experience best-in-class selfies and stunning low-light images with dual rear camera More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X